బీఆర్ఎస్ మరో సెల్ఫ్ గోల్!

Publish Date:Apr 20, 2023

Advertisement

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం, అనవసరంగా వేలు పెట్టి, చేయి కాల్చుకుందా? బీఆర్ఎస్ పార్టీ మరో మారు సెల్ఫ్ గోల్ చేసుకుందా? అంటే, అవునన్న సమాధానమే వస్తోంది, నిజానికి ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇటీవల కాలంలో ఇలాంటి తప్పటడుగులే బీఆర్ఎస్ ఎక్కువ వేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం అయితే నేమీ, నిన్న మొన్నటి పరిక్ష పత్రాల లీకేజీ వ్యవహరం, బండి సంజయ్ అరెస్ట్ విషయం అయితే నేమి,ఇలా ప్రతి విషయంలోనూ బీఆర్ఎస్ నాయకత్వం ముందు వెనక ఆలోచించకుండా తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలతో చిక్కులు తప్పడం లేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ ట్రాప్ లో పడి సమస్యలు కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ఏదో విధంగా బద్నాం చేయడమనే సింగిల్  పాయింట్ అజెండాతో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు.   

ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే సంకల్పంతో, స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొని, విశాఖ ఉక్కును కాపాడుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు చాలా చాలా హడావిడి చేశారు. ఇంతలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్థే విశాఖ వచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు అని మాట మాత్రంగా ఒక ముచ్చటను బయట పెట్టారు,అంతలోనే తూచ్ అన్నారు. కానీ, అంతలోనే, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటద ని కేసీఆర్ కు భయపడి విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, మంత్రి కేటీఆర్  జబ్బలు చరుచుకున్నారు. అయితే కేంద్ర ఉక్కుగనుల శాఖ విశాఖ ఉక్కుని అమ్మేది అమ్మేదే.. వెనక్కి తగ్గేది లేదు, అని కుండ  బద్దలు కొట్టింది. దీంతో, బీఆర్ఎస్  నాయకులు ముఖాలు చిన్నబిచ్చుకున్నారు. 

అదలా ఉంటే  బిడ్ వేసే విషయంలోనూ చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పడినట్లుగా, బిడ్ లో పాల్గొంటామని అరివీర భయంకర ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, బిడ్ గడవు ముగిసినా ఆ ముచ్చట మళ్ళీ తీయలేదు. నిజానికి  విశాఖ ఉక్కు కంపెనీ యాజమాన్యం ముందుగా ప్రకటించిన బిడ్ గడువు ఐదు రోజుల క్రితమే ముగిసింది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ లో పాల్గొనేందుకు సిద్దమైన సింగరేణి అధికారుల అభ్యర్ధన మేరకే, బిడ్ గడువును ఏప్రిల్ 20 వరకు (ఐదు  రోజులు) పొడిగించారు. ఇప్పడు ఆ  గడువు కూడా ముగిసింది కానీ, సింగరేణి బిడ్ వేయలేదు. దీంతో విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్  మరో మారు సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.