Publish Date:Oct 28, 2019
లేటుగా లేవడమో.. సమయం లేకపోవడమో సాకుగా చూపుతూ చాలా మంది ఉదయం పూట ఏమీ తినకుండా హడావిడిగా బస్సో, రైలో పట్టుకొని ఆఫీసులకు పరిగెడుతూంటారు. కానీ ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ముందు రోజు రాత్రి 10 గంటలకు తిని తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 15 గంటలకు పైగా కడుపును మాడ్చేస్తుంటారు.
కాని తప్పు తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొన్ని రోజులకు చిన్న పనికే అలసిపోవడం.. మరికొన్ని రోజులకు రక్తహీనత ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రాను రాను పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. దీనికి కారణం శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడమే.. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే. మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి అవసరం. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. మనం తీసుకునే ఆహారం నుంచే.
మనం తిన్న ఆహారం మూడు నుంచి నాలుగు గంటల్లో జీర్ణం అయిపోతుంది. కాబట్టి ప్రతి నాలుగు గంటలకు ఏదో ఒకటి తినాలి అంటారు పెద్దలు. అలాంటిది ఏకంగా 10 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీని వల్ల పోను పోను రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అథెరోస్క్లెరోసిస్ అనే అనారోగ్య సమస్య ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దళసరిగా ఉన్న ధమనులు గుండె నుంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి.
అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల ధమనుల పనితీరు మందగించడాన్ని వారు గుర్తించారు. సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా, తక్కువ పోషకాలున్న అల్పాహారం తీసుకున్నా ఈ సమస్య తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎంత ఆలస్యమవుతున్నా.. ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా సరే అల్పాహారం చేసి తరువాత ఎటువంటి పనైనా చేయండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/breakfast-34-78241.html
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది.
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా?
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి?
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ ,
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా?
అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు.
అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.