ఎయిడ్స్ రక్తం ఎక్కించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య

Publish Date:Apr 10, 2026

Advertisement

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియుడు ప్రియురాలికి ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తంఎక్కించిన ఘటన తీవ్ర సంచ లనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగా కుమార్తె ప్రేమ వివిహం చేసుకోవడానికి సిద్ధపడటంతో కుమార్తెకు సిరెంజి ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాడు. సరిగా జనగాం జిల్లాకు చెందిన మనోహర్ తనతో వివాహానికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలు రమణికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. అయితే మనోహర్ ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువతి ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెడితే..  యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి.

జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు.    మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది. అయితే..    హెచ్ఐవి పాజిటివ్ తో ఇటీవల మనోహర్ తల్లి మరణించింది.  మనోహర్ తండ్రికి కూడా ఎయిడ్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

దీంతో  మనోహర్ కూడా ఎయిడ్స్ ఉండి ఉండొచ్చని భావించిన  రమణి తల్లిదండ్రులు పరీక్ష చేయిస్తే మనోహర్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రమణి మనోహర్ ను వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.   దీంతో ఆగ్రహం చెందిన మనోహర్ ఎయిడ్స్ రక్తంతో ఉన్న ఇంజక్షన్ యువతికి ఇస్తే తనకు కూడా ఎయిడ్స్ వస్తుందని అప్పుడు  తనను  వివాహం చేసుకుంటుందని భావించాడు.

పథకం ప్రకారం.. మార్చి 11న   రమణ కి బలవంతంగా ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు  మనోహర్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఎయిడ్స్ రక్తాన్ని తనకు సిరంజి ద్వారా ఎక్కించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమణి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం (ఏప్రిల్ 10) ఆత్మహత్యకు పాల్పడింది.  పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.