అమ్మ ప్రేమకిదే తార్కాణం...చనిపోవాల్సిన వాడు లేచి కూర్చున్నాడు !

Publish Date:Jul 8, 2019

Advertisement

 

'అమ్మ..' అనేది నాకు తెలుగులో తెలిసిన తియ్యని పదం. ఆ పదం తెలియనివారు ఉండరు. అమ్మ గురించి రాయాలంటే ఎన్ని పేజీలైనా, ఎన్ని పుస్తకాలైనా సరిపోవు. అమ్మ గురించి చెప్పాలంటే మనం జీవితాంతం మాట్లాడినా సరిపోదు. అలాంటి అమ్మ గొప్పతనం మరో సారి బయట పడింది. మరి డాక్టర్ల చేతగానితనమో లేక ఆ అమ్మ పిలుపు మహత్యమో తెలియదు కానీ, అంత్యక్రియలకు రెడీ అయిన వ్యక్తి అమ్మ పిలుపు విని కోలుకుని మళ్ళీ బతికి బట్ట కట్టాడు. 

ఈ ఘటన ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనో చోటు చేసుకోలేది. విస్వనగరం హైదరాబాద్ కి కూత వేటు దూరంలో ఉండే సూర్యాపేటలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రికి చెందిన గంధం సైదమ్మకు ఇద్దరు కుమారులు. భర్త కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమారుడు సాయి డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కుమారుడు కిరణ్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 

జూన్ 26న కిరణ్‌కు వాంతులు, విరేచనాలు కావడంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. రెండ్రోజులు చికిత్స చేసినా తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు జూన్ 28న హైదరాబాద్ కామినేని వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం 29న వనస్థలిపురంలోని ఓ వైద్యశాలకు తీసుకెళ్ళారు. మూడురోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, బ్రెయిన్ డెడ్ అయ్యిందని, వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని చెప్పి ఈ నెల 3న డిశ్చార్జ్ చేశారు. 

దీంతో ఈ నెల 3న వెంటిలేటర్ తీసేసి ఖననం చేసేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌లో ఇంటికి చేరిన కిరణ్‌ కు వెంటిలేటర్ తొలగించినా ఊపిరాడుతూ గుండె కొట్టుకుంటుండడంతో అంత్యక్రియలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఈ నెల 4న ఖననం చేసేందుకు సిద్ధమవుతుండగా తల్లి సైదమ్మ ఏడుస్తూ కిరణ్...కిరణ్ అంటూ గట్టిగా పిలవడంతో అతడి కంట నుంచి నీరు కారింది. దీంతో హైదరాబాద్‌లోని వైద్యుల సూచనతో గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యం అందించగా కిరణ్‌లో కదలికలు వచ్చాయి.  ఇప్పుడు ఆ కుర్రాడు మంచం మీదనే ఉన్నా బతికి బట్ట కట్టాడు. సినిమాల్లో అంటుంటారు కదా ఇదో మెడికల్ మిరాకిల్ అంటూ అదేనేమో ఇది ? 

By
en-us Political News

  
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.