తానాలో రామ్ మాధవ్ కి అవమానం...లోకేష్ గ్యాంగ్ అంటూ !
Publish Date:Jul 8, 2019
Advertisement
బీజేపీ నేత రామ్ మాధవ్ కు దేశం కాని దేశంలో తెలుగు వారి ముంగిట అవమానం జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తానా మహాసభలు వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సభలకు అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా గౌరవ అతిథిగా హాజరయ్యారు. అయితే రాం మాధవ్ ఈ సభలో ప్రసంగిస్తుండగా కొందరు ఆయన వేదిక దిగి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించి వేదిక దిగేసి వెళ్లిపోయారు. తానా మహాసభలకు సాధారంగా బీజేపీ నేతలను ఆహ్వానించరు. అలాగే తానా మీద ఒక అభిప్రాయం ఉండేది, అది ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం అందులో ఉంటుందని చెబుతారు. అందుకే తానా సభలలో వేరే పార్టీ నేతలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు, ఈ సారి పార్టీ అధికారం కోల్పోవటం, కుల ముద్ర పడుతున్న నేపధ్యంలో వేరే పార్టీల వారిని కూడా ఆహ్వానించారు. తెలుగు ప్రముఖులలో ఒకరిగా రాం మాధవ్‌కు ఆహ్వానం వచ్చింది. దీంతో ఆయన సభలకు హాజరయ్యారు. అందులో భాగంగా తన ప్రసంగంలో తెలుగు వారందరూ ఎక్కడ ఉన్నా ఐక్యంగా ఉండాలంటూ పిలుపు నిచ్చారు. ఆ తరువాత ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ ఆయన హాయంలో దేశంలో జరుగు తున్న అభివృద్దిని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ఖ్యాతి మోదీ కారణంగా పెరిగిందంటూ రాం మాధవ్ చెబుతున్న సమయంలోనే కొందరు అడ్డు తగిలారు. నిరసన వ్యక్తం చేసారు. కేకలు వేస్తూ.. రాంమాధవ్ వేదిక మీద నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి వెను దిరిగారు. ఆ సమయంలో నిర్వాహకులు సైతం చేతులెత్తేసారట. నిజానకి పవన్ మాట్లాడిన సమయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ, రాం మాధవ్ ప్రధాని పేరెత్తే సరికి అక్కడ హాజరైన వారికి ఆగ్రహం తెప్పించింది. అయితే వారంతా టీడీపీ అభిమానులుగా చెబుతున్నారు. ఈ ఘటన మీద ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈ గొడవపై తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్నవి ‘తానా’ సభలు కావనీ, అవి ‘టీడీపీ భజన సభలు’ అని విమర్శించారు. పచ్చతముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని, రాంమాధవ్ గారిని సభలకు ఆహ్వానించి, ఆయన జాతీయవాద ప్రసంగానికి అడ్డు తగలడం ద్వారా లోకేష్ గ్యాంగ్ ఆయన్ను అవమానించిందనీ, తమ నీచబుద్దిని బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ చేసిన బురద రాజకీయాల నుంచే కమలవికాసం జరుగుతుందని కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
http://www.teluguone.com/news/content/bjp-ram-madhav-insulted-at-tana-event-39-87883.html





