Publish Date:Jan 26, 2026
వైసీపీ ఎకోసిస్టమ్ లో కొద్దో గొప్పో మర్యాదా మన్నన తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే మొదట వినిపించే పేరు బొత్స సత్యనారాయణ. రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తారు. శాసనమండలిలో ఇటీవల బొత్స సత్యనారాయణ పవన్ కల్యాణ్ ను పలకరించి, ఆయనతో సంభాషించారు. వారిరువురి మధ్యా కొద్ది సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో వైసీపీలో తీవ్ర కలకలం సృష్టించింది. బొత్స జనసేన గూటికి చేరుతారా? అన్న చర్చ కూడా జరిగింది. అయితే రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు అన్నట్లుగా బొత్స తన తీరుతో చాటారు.
ఇక తాజాగా బొత్స ఏపీ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కొద్ది సేపు సంభాషించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన బొత్స సత్యనారాయణ స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేసి కొద్ది సేపు సంభాషించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా సంబంధాలు కొనసాగించే విషయంలో ముందుగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు చెబుతారు. ఇప్పుడు ఆ ఒరవడిని ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా కొనసాగిస్తున్నారు. బొత్స సత్యనారాయణది కూడా అటువంటి వైఖరే అయినప్పటికీ, వైసీపీ నాయకుడిగా ఆయన చాలా కాలం పొలిటికల్ రైవలరీ అంటే పర్సనల్ రైవలరీయే అన్నట్లుగా వ్యవహరించారు.
అయితే ఇటీవలి కాలంలో ఆయన తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆయన స్వయంగా నారా లోకేష్ వద్దకు వెళ్లి పలకరించి, ఆత్మీయంగా సంభాషించడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. బొత్స సత్యనారాయణ తీరు పట్ల వైసీపీ అధినేత జగన్ ఒకింత గుర్రుగా ఉన్నట్లు వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.
ఇక రాజకీయవర్గాలలో సైతం బొత్స సత్యనారాయణ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద లోకేష్ తో బొత్స భేటీ పరిణామాలు వైసీపీలో ఏ విధంగా ఉంటాయన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదని అంటున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు బొత్స లోకేష్ తో ఆత్మీయంగా సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-conversation-with-lokesh-25-213036.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.