బొత్సకి బ్రెయిన్ డ్యామేజ్?
Publish Date:Aug 8, 2024
Advertisement
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ డ్యామేజ్ అయిందేమోనన్న డౌట్ కలుగుతోంది. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు అలా వుంది మరి. ప్రస్తుతం విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బొత్స రంగంలో వున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే, ఆయన మాటల్లోని వాచాలత్వాన్ని చూస్తుంటే నిజంగానే ఆయన బ్రెయిన్‌కి ఏమైనా అయిందో ఏం పాడో అనిపిస్తోంది. జనరల్‌గా ఆయన మాట్లాడేదేమీ అర్థం కాదు. ఒక వేళ అర్థం అయిందంటే, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారేంటి అనిపించడం ఖాయం. బుధవారం నాడు విశాఖలో జరిగిన ఒక మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ మీడియా మీద విరుచుకుపడ్డారు. మీడియా వాళ్లకి పనీపాట వుండదని, భుక్తి కోసం ఏదేదో రాసుకుంటూ వుంటారని అన్నారు. అదేవిధంగా, ఈసారి ఎన్నికలలో జనం తన్ని తరిమినా ఈ వైసీపీ బ్యాచ్‌కి బుద్ధి వచ్చినట్టు లేదు.. అందుకే వాళ్ళ తీరు మారలేదు. ఒక ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెబుతున్నారు. నిజానికి బొత్స లాంటి వాళ్ళు మూసుకోవాల్సింది కళ్ళు కాదు.. నోరు!
http://www.teluguone.com/news/content/botsa-comments-on-media-25-182482.html





