బొత్స అండ్ కిరణ్ ఆర్ నవ్ ఫ్రెండ్స్

Publish Date:Oct 31, 2013

Advertisement

 

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ విభజనకు వ్యతిరేఖంగానో, అనుకూలంగామాట్లాడుతూనో అదీ వీలుకాకపోతే ఇంట్లో దుప్పటి ముసుగేసి పడుకొనో కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ పాపం! బొత్సబాబుకే ఏమి మాట్లాడాలో తెలియక, ఏదేదో మాట్లాడేస్తూ తన ఆ జ్ఞానమంతా బయటపెట్టేసు కొంటున్నారు. తను సమైక్యవాదినని చెపుతూనే ఇక డెఫినెట్గా విభజన జరిగిపోతుందని చెపుతారు. తనకు ముఖ్యమంత్రిపై ఆశ ఉందని, అందుకే రాష్ట్ర విభజనకు కేంద్రాన్ని ప్రోత్సహించానని పార్టీలో బయట కూడా కొందరు మతి స్థిమితం లేని వాళ్ళు అవాకులు చవాకులు వాగుతున్నారని అంటారు. ఆ వెంటనే 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే మాట మరిచిపోకుండా కలుపుతుంటారు.

 

తను పీసీసీ అధ్యక్షుడినని గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని చూడకుండా “పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే బయటకి పొండి” అని చిందులు వేసిన తరువాత, వాళ్ళు కూడా తనకంటే సీనియర్స్ అనే సంగతి గుర్తుకు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి “నా ఉద్దేశ్యం అదికాదు...” అంటూ ఏవో సంజాయిషీలు ఇస్తూ మరింత గందరగోళం సృష్టిసారు.

 

ఫేస్ బుక్కులో తండ్రి కొడుకులో లేక అన్నదమ్ములో లేక మొగుడు పెళ్ళాలో ఇవాల్టి నుండి ఫ్రెండ్స్ అని మెసేజ్ ఏవిధంగా వస్తుందో అదేవిధంగా ఇప్పుడు బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని ఆయన ప్రస్తుతం చెప్పుకొంటున్నారు. అలాగని కిరణ్ కుమార్ రెడ్డిని అనుసరించే దైర్యం ఉందా? అంటే అదీ అనుమానమే.

 

ఎందుకంటే అధిష్టానం చల్లగా చూస్తే నేడు కాకపోతే రేపు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా ముఖ్యమంత్రి అవకపోతానా అనే ఆలోచన ఉంది కదా! అటువంటప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి ముఖ్యమంత్రి పదవి గట్టిగా పట్టుకొని సమైక్యంగా ముందుకు సాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి చేయి పట్టుకొని ముందుకు సాగడం అంటే, ఇక శాశ్వితంగా రవాణా శాఖకే కమిట్ అయిపోయే ప్రమాదం ఉంది.

 

అయితే దివాకర్ రెడ్డిని అన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డిని ‘పార్టీలో నుండి బయటకి పొమ్మనే’ సాహసం చేయలేక బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొంటున్నారనుకోవాలి. ఒకవేళ అధిష్టానం “రిప్లేసింగ్ కిరణ్ కుమార్ రెడ్డి సూన్” అని మెసేజ్ ఏమయినా పెడితే, అప్పుడు ఆయన ‘నెట్ వర్క్’ లో మార్పులు ఏర్పడవచ్చును. ఏమయినప్పటికీ ఆయన ఈ విషయంలో చిరంజీవికి ఈ మాత్రం తీసిపోరని మాత్రం గట్టిగా చెప్పవచ్చును.

By
en-us Political News

  
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని రోడ్లూ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లుగా భక్తుల రాక కొనసాగుతుండటంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నిటిలోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం ఇదేనని అధికారులు అంటున్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోమారు నోటీసులు పంపారు. తాడేపల్లి ప్యాలెస్ బయట ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించింది. జగన్ పై హత్యాయత్నం అంటూ వార్తలను వండి వార్చింది. ఈ అగ్నిప్రమాదం తాడేపల్లి ప్యాలెస్ బయట రోడ్డు పక్కన ఉన్న లాన్ లో జరిగింది.
మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధించారంటూ కోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలసిందే.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఫిబ్రవరి 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నించిపోయాయి.
 చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 22 మంది రామ సైన్యం పేరిట దేవాలయంలో దూరినట్టు రంగరాజన్ చెప్పారు
జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఇక ముందగా తాను నిర్ణయించుకున్నట్లు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరడానికి రెడీ అయిపోయారు.
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితుడు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు.
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి అనే మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో లక్ష్మి ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో జైపూర్ పోలీసులు తిరుపతి  ప్రెస్ క్లబ్ వద్ద అరెస్ట్ చేశారు
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  అగ్ని మాపక సిబ్బంది నిన్నటి నుంచి మంటలనార్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మదీనా సమీపంలోని దివాన్ దేవ్ డి ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక తేటతెల్లం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్ సి ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.  రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలకు చెల్లు చీటీ పాడే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నది. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ. లోకల్ బాడీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు తావులేదని చెబుతూ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనంటూ ఓ నివేదిక రూపొందించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్య స్నానం ఆచరించారు. అంతకముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో లక్నో చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.