జగన్ యూత్ గేమ్.. వ్యూహం ఏంటి?

Publish Date:Aug 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలవైసీపీ  చేపడుతున్న యువజన, విద్యార్థి ఆందోళనలు   చర్చనీయాంశంగా మారాయి. డీఎఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా వివాదాలపై  వైసీపీ జెన్ జడ్ తరాన్ని అస్త్రంగా చేసుకుని సరికొత్త పోరాటానికి తెరలేపింది. ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

వైసీపీ చేపట్టిన ఈ పోరాటం   అభ్యర్థుల సమస్య కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ   వ్యూహం దాగి ఉందని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, డీఎస్‌సీ,  ఇతర నియామక ప్రక్రియల్లో ఏ చిన్న లోపం ఉన్నా దానిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో  వైసీపీ వ్యూహాత్మకంగా  ముందుకు సాగుతోందన్నారు. 

డీఎస్‌సీ స్పోర్ట్స్ కోటా మరియు నియామక ప్రక్రియలో జరుగుతున్నాయంటున్న ఆరోపణలను పాలక పక్షం తేలిగ్గా తీసిపారేయడం సరైన పద్ధతి కాదన్న చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,  ఉన్నతాధికారులు   సాంకేతిక వివరణలు ఇచ్చి ఊరుకోకుండా, ప్రజ లకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో పారదర్శక వివరణ ఇవ్వాలన్నారు. అలాగే..  ప్రతిపక్షం లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు అవసరమైతే స్వతంత్ర విచారణ కమిటీ,  లేదా ప్రజా సంఘాలతో కూడిన విచారణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏ తప్పూ చేయనప్పుడు విచారణకు వెనుకడాల్సిన అవసరం లేదని, తద్వారా ప్రభుత్వానికే మరింత విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషించారు.

 

AP Politics, YSRCP Youth Strategy, Nara Lokesh,  DSC Recruitment, Chalasani Srinivas Analysis, TeluguOne

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.