లోటు వర్షపాతం అంటున్న సైన్స్.. భారీ వర్షాలు ముంచెత్తుతాయంటున్న భవిష్యవాణి!

Publish Date:Aug 3, 2026

Advertisement

ఒకవైపు ప్రపంచ వాతావరణ సంస్థ,  భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో  ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే..   సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో   భవిష్యవాణి   మాత్రం  కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది. సోమవారం (ఆగస్టు 3)  సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో జరిగిన రంగం లో మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి  రాష్ట్రం భారీ వర్షాలు, వరదల ముప్పు ముంగిట ఉందని చెప్పింది.  

  వాతావరణ శాఖ..  పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో  సూపర్ ఎల్ నినో ఏర్పడిందనీ, దీని ప్రభావంతో  వర్షాకాలం  సాధారణం కంటే చాలా చాలా తక్కువ వర్షపాతం నమోదౌతుందనీ శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా చెబుతుంటే..   ఆ శాస్త్రీయంగా వేసిన అంచనాలకు భిన్నంగా  అమ్మవారి భవిష్యవాణి  ఉంది.  ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో  అతిభారీ వర్షాలు కురిసి, భయంకరమైన భారీ వరదలు సంభవిస్తాయని భవిష్యవాణి కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.   

భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని పేర్కొంది.  వర్షాలతో పాటు ఈ ఏడాది భారీ అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఆస్తి నష్టంతో పాటు  ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని భవిష్యవాణి పేర్కొంది.  ధర్మాన్ని పాటిస్తూ భక్తితో నడుచుకుంటే ఎంతటి ఆపద వచ్చినా భక్తులను కాపాడుకుంటానని అమ్మవారు అభయమిచ్చినట్లు స్వర్ణలత  వినిపించిన భవిష్యవాణి పేర్కొంది.   6 నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ఠ చేయకుంటే పెనుముప్ప తప్పదని హెచ్చరించింది.  శాస్త్ర విజ్ణానం అంచనాలు నిజమై లోటు వర్షపాతంలో కరవు చ్ఛాయలు అలముకుంటాయా? అమ్మవారి భవిష్యవాణి చెప్పినట్లు కుండపోత వర్షాలు ముంచెత్తుతాయా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ సమాజాంలో జోరుగా సాగుతోంది. 

Telangana Heavy Rains Alert,  Matangi Swarnalatha Bhavishyavani, Secunderabad Mahankali Bonalu, Telangana Floods Warning, IMD Weather Forecast Telangana

By
en-us Political News

  
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.