మెగా డీఎస్సీపై పిల్.. ఏపీ హైకోర్టు ఏమందంటే?

Publish Date:Aug 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్   మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ పిల్ దాఖలు చేసినది వైసీపీ ఎమ్మెల్సీ  పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. పర్వతరెడ్డి చంద్రభేఖరరెడ్డి  దాఖలు చేసిన పిల్ లో   ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయనీ, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ) చేత విచారణ జరిపించాలని  కోరారు. 

అయితే.. హైకోర్టు ఈ పిల్ విచారణకు నిరాకరించింది.  ఈ సందర్భంగా హైకోర్టు.. సీరియస్ వ్యాఖ్యలు చేసింది.   ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు,  వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది.  పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.

 బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు విభేదించింది.  మెగా డీఎస్సీ నియామకాలు,  నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో వందలాది పిటిషన్లు దాఖలైన అంశాన్ని గుర్తు చేసిన హైకోర్టు..  ఆధారాలు లేకుండా నియామక ప్రక్రియ మొత్తాన్ని సవాల్ చేయడం తగదని విస్పష్టంగా పేర్కొంది.  

Mega DSC AP,  AP High Court DSC Verdict, YCP PIL Mega DSC,  AP Teacher Recruitment News, Parvathareddy Chandrasekhar Reddy PIL

By
en-us Political News

  
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
విమాన ప్రయాణం అంటే సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది అని అందరూ భావిస్తారు. కానీ, నింగిలో ప్రయాణిస్తున్న వేళ ఊహించని విపత్తులు ఎదురైతే ఆ అనుభవం
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మూసివేయడానికి లేదా పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.
జగన్ దర్శనం దక్కకుండా సజ్జల అడ్డుకుంటున్నారు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.