నిమ్స్ హాస్పిటల్లో దారుణం.. అర్ధరాత్రి యువతిపై అసభ్య ప్రవర్తన..!
Publish Date:Aug 4, 2026
Advertisement
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. ! చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడంలేదు. చివరకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళను సైతం లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆసుపత్రి అంటే ప్రాణాలు కాపాడే చోటు.. రోగులకు భరోసా కల్పించే ప్రదేశం. కానీ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమిత మైన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన పంజాగుట్టలో కలకలం రేపింది. నిమ్స్ హాస్పిటల్లో ఉన్నవారంతా అంతా గాఢ నిద్రలో ఉన్న సమయం.. ఆసుపత్రి వార్డులో నిశ్శబ్ద వాతా వరణం నెలకొంది. ఇదే అదనుగా భావించిన.. పక్క బెడ్లో చికిత్స పొందుతున్న రోగి అటెండెంట్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రెండు కాళ్లు విరిగి కదల్లేని పరిస్థితిలో ఉన్న తనపై అతడు అనుచితంగా ప్రవర్తించాడు. అనంతరం ఘటనతో తీవ్ర ఆందోళన కు గురైన యువతి జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయా నికి సంబంధించిన ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూ లాన్ని నమోదు చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ యువతికి.. అదీ రెండు కాళ్లు విరిగి కదల్లేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి అనుభవం ఎదురవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆసుపత్రిలో రోగుల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున 3-4 మధ్య జరిగింది. అసలు తెల్లవారుజామున ఏం జరిగింది? యువతి చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం? ఘటన సమయంలో అక్కడ ఏం జరిగింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nimes Hospital, Panjagutta Police Station, Patient Attendant, Indecent behavior, ,CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police
http://www.teluguone.com/news/content/nimes-hospital-36-228008.html





