కల్తీల నిరోధానికి కఠిన చట్టం.. రేవంత్ రెడ్డి.!
Publish Date:Jul 18, 2026
Advertisement
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు అన్ని కల్తీల బారిన పడుతుండడంతో ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టంపై ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (జులై 18) సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్న సీఎం ఎరువులు, పురుగు మందుల భారీ వాడకంతో పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు నిరాకరిస్తున్నాయన్నారు. మార్కెట్ లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలురకాల ఉత్పత్తులు అమ్ముతున్నారని, అధిక ధరలు ప్రజలు వాటిని కొంటున్నా... అవి సేంద్రియ ఉత్పత్తులే అని నిర్ధరించేందుకు సరైన వ్యవస్థలు లేవన్నారు. ఈ నేపథ్యంలో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను తయారు చేయాలన్నారు. దానిపై బిల్లు రూపొందించి శాసనసభలో చర్చ చేపడతామని సీఎం తెలిపారు. కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లను నియమించాలని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. Strict law to curb adulteration, Telangana CM Revanth Reddy, Review on Adultration
http://www.teluguone.com/news/content/strict-law-to-curb-adulteration-36-226424.html





