నాంపల్లి కోర్టుకు బాంబు బెదరింపు
Publish Date:Dec 18, 2025
Advertisement
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టు భవనంలో బాంబు అమ ర్చామనీ, మధ్యాహ్నం 2 గంటలకు పేలిపోతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కోర్టు వద్దకు చేరుకున్న పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అలాగే న్యాయమూర్తులు సహా కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి, కోర్టు భవనాన్ని, ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. బాంబు బెదరింపుతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త వతావారణం నెలకొంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు లోపలా, వెలుపలా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కొర్టులోని ప్రతి గది, కారిడార్, కోర్ట్ హాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.అకస్మాత్తుగా కోర్టు ఖాళీ చేయడంతో న్యాయవాదులు, కేసుల కోసం వచ్చిన జనం భయాందోళనలకు గుర య్యారు. కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి, తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి అనుమతించ లేదు. అదే సమయంలో ఈ బాంబు బెదిరింపు నిజమా లేక తప్పుడు సమాచారమా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది.
http://www.teluguone.com/news/content/bomb-threat-ti-nampallt-court-36-211192.html





