కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి

Publish Date:May 7, 2026

Advertisement

 

కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆయుధాల బెదిరింపుల ఘటన, నేతల మధ్య తీవ్ర విమర్శలు, అనంతరం పార్టీ శ్రేణుల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్‌లోని అల్గునూరు చౌరస్తాలో ఖాలీద్ అనే హైకోర్టు న్యాయవాదిని కొందరు దుండగులు తుపాకులతో బెదిరించిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయంపై న్యాయవాది కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లభించలేదని ఆరోపించారు. దీనితో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో రాష్ట్రంలో గన్ కల్చర్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డ్రగ్స్ పరీక్షలకు కల్వకుంట్ల తారక రామారావు సిద్ధంగా ఉన్నారని, అలాగే రేవంత్ రెడ్డి మరియు  బండి సంజయ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్నవాహ నాన్ని కూడా ధ్వంసం చేశారు. 

ఈ దాడి జరిగిన కార్యాలయం గంగుల కమలాకర్ కు చెందిన క్యాంప్ ఆఫీస్‌గా తెలుస్తోంది. బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకే నిరసనగా ఈ దాడి జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలతో జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.

 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.