గేట్ర‌ర్‌పై బీజేపీ గురి.. చంద్ర‌బాబు, అమిత్‌షా భేటీలో చ‌ర్చ‌!

Publish Date:Oct 20, 2024

Advertisement

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి స్థానాలు ద‌క్క‌క‌పోయినా.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టింది. ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో.. తెలంగాణ‌లో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నట్లు బీజేపీ చాటింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తర‌హాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తూ అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతోంది. ఈ క్ర‌మంలోనే గ్రేటర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ గురి పెట్టింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని ఆ పార్టీ నేత‌లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఎన్డీయే కూట‌మిలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఉన్నాయి. తెలంగాణ‌లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌ను క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నికల్లో పోటీ చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం లాంటి బ‌ల‌మైన పార్టీ అండ‌దండ‌లు ఉంటే గ్రేట‌ర్‌లో విజ‌యం న‌ల్లేరుపై బండి న‌డకే అవుతుంద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ప‌దేళ్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ హ‌వా కొనసాగుతూ వ‌చ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గేమ్ ఆడితే అదే హైదరాబాద్ లో కీలకంగా మారేది. కానీ, ఇప్పుడు కథ మారింది. బీఆర్ఎస్ క్ర‌మంగా త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో గ్రేటర్ లోని ప‌లువురు నేతలు పార్టీని వీడారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ పరిణామం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. మ‌రో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు, మూసీ సుందరీకరణకు ఎందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌న్న‌ది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్ర‌భుత్వ తీరును  త‌ప్పుప‌డుతున్నారు. మ‌రో వైపు ప్రభుత్వ తీరుపై గ్రేటర్ వాసుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటున్నది. 

గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎన్నోఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిపోయారు. వీరంతా ఎక్కువ శాతం తెలుగుదేశం మద్దతుదారులు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెదగా క్రీయాశీలంగా లేకపోవటంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పుడు  గ్రేటర్ పరిధిలోని తెలుగుదేశం సానుభూతిపరులను తమవైపుకు తిప్పుకొనేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది.  బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ తోపాటు ప‌లు జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తెలంగాణ బీజేపీలోని కొంద‌రు నేత‌లు తెలుగుదేశంతో పొత్తుకు అభ్యంత‌రం చెప్ప‌డంతో బీజేపీ ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో తెలుగుదేశం సానుభూతిప‌రులు అధిక‌శాతం మంది రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హించిన కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. 

మ‌రో ఏడాది త‌రువాత జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పోటీలో లేకుంటే ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు కాంగ్రెస్ కే మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పుచేయ‌కుండా,  తెలుగుదేశంతో క‌లిసి పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. తెలుగుదేశంతోపాటు జ‌న‌సేనని కూడా క‌లుపుకొని గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వెళితే మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌టం సాధ్య‌మ‌వుతుంద‌ని బీజేపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో ఆ స‌మ‌యానికి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏ విధంగా మారుతోయో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.