జ‌బ‌ర్ద‌స్త్‌గా బీజేపీ పోల్ మేనేజ్‌మెంట్‌.. ఈట‌ల ఇక బిందాస్‌...

Publish Date:Jun 25, 2021

Advertisement

క‌మ‌ల‌ద‌ళం దండెత్తితే ఎట్టా ఉంటాదో తెలుసా? కాషాయపార్టీ వ్యూహాలు ఎంత ప‌క‌డ్బందీగా ఉంటాయో తెలుసా? రామ‌భ‌క్తుల మోహ‌రింపు ఏ రేంజ్‌లో ఉంటాదో తెలుసా? ఓట్ల పోరులో ప్ర‌తీ ఓటును ఎంత పక్కాగా ఫోక‌స్ చేస్తారో తెలుసా? ఒక్క ఓట‌ర్ కూడా మిస్ అవ‌కుండా ఇంటింటికీ కాషాయ కండువా ఎట్టా వెళుతుందో తెలుసా? ఇవ‌న్నీ తెలియాలంటే ఓసారి హుజురాబాద్ వైపు చూడాలి. ఇంక ఎన్నిక‌ల న‌గారా అయినా మోగ‌నే లేదు.. అప్పుడే నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌మ‌ల‌నాథులు ఎలా క‌మ్మేశారో చూడండి.. ఒక్కో పట్ట‌ణం.. ఒక్కో మండ‌లం.. ఒక్కో గ్రామం.. ఒక్కో బూత్‌.. ఇలా ప‌క్కాగా ప్రణాళిక వేసుకుని.. హేమాహేమీల్లాంటి నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. బీజేపీకి అత్యంత బ‌లంగా ఉండే పోల్ మేనేజ్‌మెంట్‌ను ఈసారి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే అంతా రెడీ.. ఇక కార్య‌చ‌ర‌ణే ఆల‌స్యం. 

బీజేపీకే ఈట‌ల రాజేంద‌ర్‌తో అడ్వాంటేజ్‌.. బీజేపీతో ఈట‌ల‌కు పెద్ద‌గా ప్రయోజ‌నం లేద‌నే వాద‌న‌లు ప‌స లేనివ‌ని తాజా కార్య‌చ‌ర‌ణ‌తో తేలిపోతోంది. అన్ని పార్టీలు ఆహ్వానించినా.. ఈట‌ల ఏరికోరి బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారో స్ప‌ష్ట‌మ‌వుతోంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో క‌మ‌ల‌నాథులు దిట్ట‌. అదే ఇప్పుడు ఈట‌ల‌కు శ్రీరామ ర‌క్ష‌. ప‌క‌డ్బందీగా కాషాయ వ్యూహం సిద్ధ‌మైపోయింది. భారీ క‌స‌ర‌త్తుతో క‌మ‌ల‌దండు హుజురాబాద్ వైపు ప‌య‌న‌మైంది. సేమ్ దుబ్బాక సీన్‌నే అక్క‌డా రిపీట్ చేయ‌బోతున్నారు. సేమ్ దుబ్బాక ఫ‌లితాన్నే హుజురాబాద్‌లోనూ సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే, దుబ్బాక ఉప ఎన్నికకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన మాజీ టీఆర్ఎస్ నేత‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డినే హుజురాబాద్‌ నియోజకవర్గానికీ ఇన్‌చార్జీగా నియమించారు. ఈ ఒక్క నిర్ణ‌యం చాల‌దా దుబ్బాక‌ రిపీట్స్ అని చెప్ప‌డానికి.

ఇక‌, జమ్మికుంట పట్టణానికి ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ అరవింద్‌ను నియ‌మించారు. వెల‌మ సామాజిక వ‌ర్గం అధికంగా ఉండే జమ్మికుంట మండలానికి అదే వ‌ర్గానికి చెందిన‌.. హ‌న్మ‌కొండ‌కు చెందిన‌ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధ‌ర్మారావును నియ‌మించారు, హుజూరాబాద్‌ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హుజూరాబాద్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కేటాయించారు. ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డిని, కమలాపూర్‌ మండలానికి ఇటీవ‌ల బీజేపీలో చేరిన‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. వీరి నేతృత్వంలో ఆయా మండలాల్లో ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఓటరును స్వయంగా కలవడం ద్వారా విజయం సాధించాల‌ని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ సొంత జిల్లాతో పాటు ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నందున ఈ ఉప ఎన్నిక‌కు ప్రాధాన్యం పెరిగింది. హుజురాబాద్‌లో విజయం సాధించడం ద్వారా బండి సంజయ్ తన స‌త్తాను బ‌లంగా చాటుకోవాల‌ని భావిస్తున్నారు. అందుకే, ఆయ‌న హుజురాబాద్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. 

హుజురాబాద్‌ నియోజకవర్గంలో 305 పోలింగ్‌ బూత్‌లు, 2,26,553 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌లవారీగా బీజేపీకి కమిటీలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని మూడు పోలింగ్‌ బూత్‌లకు ఒక శక్తి కేంద్రంగా విభజించారు. మొత్తం 102 శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వీటికి ఇన్‌చార్జీలను, కమిటీలను నియమిస్తున్నారు. ఒక్కో బూత్‌ కమిటీలో పార్టీలోని అన్ని విభాగాలకు చెందిన ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తున్నారు. కమిటీకి 10 మంది సభ్యులకు తగ్గకుండా ఉంటారు. బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాల కమిటీలు ప్రతి ఓటరును కలిసి బీజేపీ గెలుపున‌కు కృషి చేయ‌నున్నారు. 

ఒక్కో పోలింగ్‌ బూత్‌లో సగటున 700 నుంచి 750 వరకు ఓటర్లు ఉండే అవకాశముంది. బూత్‌ కమిటీ సభ్యులు ఆ ఓటర్లను పంచుకొని ఒక్కో సభ్యుడు 50 నుంచి 60 మంది ఓటర్ల బాధ్యతను తీసుకొని నిత్యం వారిని కలుస్తూ పార్టీకి అనుకూలంగా మార్చడం, పోలింగ్‌ రోజు వారిని తీసుకెళ్లి ఓటు వేయించుకోవడంలాంటివి చేస్తారు. ఇలా, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని అడ్డుకోవడానికి పకడ్బందీ కార్యాచరణతో బీజేపీ ముందుకుపోతోంది. దీంతో.. హుజురాబాద్‌లో దుబ్బాక త‌ర‌హా హోరాహోరీ సంగ్రామం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. క‌మ‌ల‌నాథులు చేస్తున్న పోల్ మేనేజ్‌మెంట్ చూస్తుంటే.. బీజేపీనే ఈట‌ల‌కు అద‌న‌పు బ‌లంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
 

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.