దక్షిణాది పై పట్టు కోసం .. కమల దళం కొత్త వ్యూహం
Publish Date:Aug 27, 2022
Advertisement
భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు, ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ, ఇప్పుడు ఇక్కడ అక్కడ అని కాకుండా, దేశం అంతటా ప్రాబల్యం పెంచుకు నేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి దక్షిణాదిలో పాగా వేసేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందుకోసంగా, ‘బీజేపీ సౌత్ మిషన్’ పేరిట బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఇందు భాగంగానే, కమల దళం ఉభయ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించింది. నిజానికి, అమిత్ షా 2014లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడే ఇప్పటి వరకు పార్టీ ఒకసారి కూడా అధికా రంలోకి రాలేని దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారం చేపట్టడమే పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యంగా ప్రక టించారు. ఆ తర్వాత అస్సాంతో సహా పలు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేసింది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా సమీప భవిష్యత్తులో అధికారం లోకి రాగలమనే ధీమాతో ఉన్నారు. అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఆ వ్యూహాలు ఫలించలేదు. ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకురావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలు చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వలేదు. గతంలోని కొన్ని వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో పార్టీ ఇప్పుడు దక్షిణాదిని విస్తరిం చేందుకు, 2024 ఎన్నికలలో కొత్త ఎన్నికల విజయాలను సాధించేందుకు కొన్ని కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాజకీయాలు ఉత్తరాదికన్నా భిన్నమైనవని పార్టీ నాయకత్వం గ్రహించింది. ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైద్ధాంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారం భించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తు న్నం దున,ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయు ధాన్ని ఎంచుకొంటున్నది. కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశం 2014 నుండి ప్రముఖ బీజే పీ నినాదాలు. అయితే 2024లో `వారసత్వ ముక్త - భారత్’ నినాదాన్ని జోడింపనున్నది. తద్వారా యువత ను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దే శించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోడీ తరచూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రసంగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ , బీజేపీకి కుటుంబ పాలన వ్యతిరేక సెంటిమెంట్ రాజకీయం గా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక పోతున్న రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధా నాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగి లిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి పార్టీ మొత్తం రాష్ట్రంపై దృష్టి పెట్టకుండా, కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రు లకు అప్పచెప్పి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేపట్టనుంది. ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. తమిళనాడులో, రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గ ప్రభావాన్ని ఉపయోగించుకునేలా, ఆధిపత్య వన్నియార్లను ఆకర్షించడానికి పార్టీ తన ప్రయత్నాలను కొనసాగి స్తుంది. దాదాపు 150 బలహీన నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ‘ప్రవాస్’ ప్రచారంతో పాటు రూపొందించిన కొత్త వ్యూహం, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి, ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలను వెల్లడి చేస్తుంది. ఇప్పటి వరకు దక్షిణాదిన చేస్తున్న ప్రయత్నాలు తగు ఫలితాలు ఇవ్వకపోవడం గ్రహించి, సరికొత్త వ్యూ హాలతో బిజెపి సరికొత్త సౌత్ మిషన్‌ను సిద్ధం చేశారు. ఉదాహరణకు, తమిళనాడులో, రజనీకాంత్ వంటి ప్రముఖ స్టార్‌ను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నించి విఫలమైంది. ఏఐఏడీఎంకేతో పొత్తు కూడా ఆశిం చిన ప్రయోజనం చేకూర్చలేక పోయింది. అదేవిధంగా, కేరళలో, భరత్ ధర్మ జనసేన (బిడిజెఎస్) ద్వా రా ఓబిసి ఈజ్వా కమ్యూనిటీని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వ లేదు. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ నమ్మకస్తుడైన ఈటెల రాజేందర్ ను పోటీకి దింపి హుజూరాబాద్ అసెంబ్లీ సీటును బీజేపీ గెలుచుకో గలిగింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలోని కొన్ని నియోజకవర్గాలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారిస్తుం డగా, తెలంగాణ మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బలమైన అవకాశం ఉందని భావిస్తు న్నారు. ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయ డానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్య దక్షిణాది రాష్ట్రాలపై దాని కొత్త జోరులో భాగమే. పైగా, తెలంగాణ నుండి డా. లక్ష్మణ్ కు, కర్ణాటక నుండి యడ్డ్యూరప్పకు పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్ని కల కమిటీలలో స్థానం కల్పించారు. డా. లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. సంస్థాగత వ్యవహారాలలో నిపుణుడైన సునీల్ బన్సల్ ను తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో పార్టీ సంస్థాగత వ్యవ హారాల ఇన్ ఛార్జ్ గా పంపారు. ఏ మూడు రాష్ట్రాలలో అడిహకారంలోకి రావడంకోసం కృషి చేస్తుండడం తెలిసిందే. నిజానికి, 2024లో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, ప్రాంతీయ పార్టీ ల ప్రాబల్యా న్ని కట్టడి చేసేందుకు, బీజేపీ దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు వస్తోందని, పార్టీ వర్గాల సమా చారంగా ఉందని, అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-planing-to-get-hold-on-south-25-142756.html





