ర‌జ‌నీకి గవర్నర్ గిరీ ఎర.. దక్షిణాదిలో పాగాకు బీజేపీ ఎత్తుగడ!

Publish Date:Aug 18, 2022

Advertisement

వల‌వేసిన‌వాడు చిన్న‌చేప కోస‌మే రోజంతా వేచి ఉండ‌డు. వల వేసిన ప్రతి సారీ ఏదో ఒక పెద్ద చేప‌ను ప‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తోనే ఉంటాడు. కచ్చితంగా పెద్ద చేప చిక్కుతుంద‌న్న‌ది అత‌ని న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కంతోనే ఎంత‌టి ప‌నైనా సాధించ‌వ‌చ్చ‌న్న‌ది బీజేపీ వ్యూహ‌కారులు ఇటీవ‌లి కాలంలో స్ప‌ష్టం చేసింది.  దేశంలో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికి విప‌క్షాల‌ను దెబ్బ‌తీయ‌డంలో అనేక వ్యూహ‌ వ‌ల‌ల‌ను కమలం పార్టీ వేసింది. ఒక్క‌టి రెండు త‌ప్ప అన్నీ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చాయి. ఇపుడు ద‌క్షిణాదినా వారి అజ‌మాయిషీ సాధిం చుకోవ‌డానికి త‌మిళ‌నాట తాజాగా వ‌ల విసిరేరు.  ఆ వలకు రజనీకాంత్ అనే పెద్ద చేప చిక్కింది.

ఒక్క డైలాగ్‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను వెర్రెక్కించి త‌న వీరాభిమానుల‌ను చేసుకోగ‌ల స‌త్తా ఉన్న న‌టుడు ర‌జ నీ. త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌,  శివాజీగ‌ణేష‌న్‌, క‌మ‌ల్ త‌ర్వాత అంత‌టి  స్థానాన్ని సంపాదించిన న‌టుడు ర‌జ‌నీకాంత్. ర‌జ‌నీ సినిమాలంటే ప‌డి చ‌చ్చే జ‌నం ఆయ‌న రాజ‌కీయాల్లోకీ వ‌చ్చి రాజ‌కీయ రంగాన్ని ప్ర‌క్షా ళ‌న చేయాల‌ని వీరాభిమానులు   ఆశించారు. ఓకే మీ మాటే నా మాట అని పార్టీని ప్ర‌క‌టించారు ర‌జ‌నీ. కానీ ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌క‌పోవ‌డంతో రేపు, ఎల్లుండీ అంటూ క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా కాళ్లూ చేతులూ పెట్ట‌డానికి ముందు వెనుకలాడారు. చివరికి అనారోగ్యం అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే రాజకీయ సన్యాసం ప్రకటించేవారు.  క్ర‌మేపీ సామా జిక ప‌రంగా ఎంతో సేవచేయాల్సి ఉంద‌ని అభిమానుల‌కు ర‌జ‌నీ త‌న మాట‌గా ప్ర‌క‌టించి రాజ‌కీయాల సంగ‌తి ఆలోచించ‌కుండా చేయ‌గ‌లిగారు. అయితే తాను వాస్త‌వానికి క‌ర్ణాట‌క నుంచి మ‌ద్రాసు వ‌చ్చి సినీ న‌టునిగా స్థిర‌ప‌డి త‌మిళుల హృద‌యాల్లో తిష్ట వేసిన మ‌హా న‌టుడు రజనీకాంత్. 

ఇప్పటికీ త‌మిళుల భావ‌న అదే. అయితే కాల‌క్ర‌మంలో రాజ‌కీయాల రంగు కూడా పుల‌మ‌డంతో ఆయ‌న మ‌న‌వాడు కాదు గ‌నుక ఆయ‌న్ను దూరంగా పెట్టాల‌న్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.  దీంతో ప‌రిస్థితులు  ర‌జ నీకి ప్రతికూలంగా మారాయి. ర‌జ‌నీ త‌న స్థాయిని, జ‌నాల్లో ప‌ట్టును, ప్ర‌తిష్ట‌ను కాపాడుకోవ‌డానికి బీజేపీ వారి స‌హాయ స‌హ కారాల‌ను కోరారు.

ఇలా చాలా కాలం నుంచే ర‌జ‌నీ బీజేపీతో  స‌ఖ్య‌ంగా ఉంటూ వచ్చారు. ఇక తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, ప‌రిణామాల దృష్ట్యా ఇది బీజేపీ   ఆస‌రాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. త‌మిళ‌నాట  ర‌జ‌నీ ఇంటి దేవ‌త‌తో స‌మానం. ఇలాంటి అత్యంత పాప్యుల‌ర్ న‌టుడిని, వ్య‌క్తిని త‌మ‌కు గొప్ప అస్త్రంగా దొర‌క‌డం, దాన్ని మ‌రింత ప‌దునుపెట్టి ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ద‌క్షిణాదిన త‌మ రాజ‌కీయ ఎత్తు గ‌డ‌లు విజ‌య‌వంతంగా వేయ‌వ‌చ్చ‌ని, ముందుకు దూసుకుపోవ‌చ్చ‌న్న ఆలోచ‌న చేసింది టీమ్ మోదీ!

ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాట ఉన్న అపార అభిమాన జ‌నం బీజేపీ కీ కూడా ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఆలోచ‌న‌లోనే ఆయ‌న్ను వ‌ల‌వేసి ప‌ట్టింద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయ‌న‌కు గ‌న‌క గవర్నర్ ప‌ద‌వి ఇస్తే, రాష్ట్రంలో తిరుగులేకుండా పోతుంద‌న్నది బీజేపీ వ‌ర్గాల న‌మ్మ‌కం కూడా. అస‌లే ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న ఈ త‌రుణంలో ర‌జ‌నీని ద‌గ్గ‌ర‌వానిగా మ‌రింత ఆత్మీయునిగా చేసుకుని ఉన్న‌త ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌గిలిగితే త‌మిళ‌నాడు, ద‌క్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేసే ఆలోచ‌న‌లు మ‌రింత ప‌దునుగా అమ‌లు చేయ‌డానికి ఎంతో ఆస్కారం ఉంద‌న్న‌ది బీజేపీ మేథోవ‌ర్గానికి అనిపించి ఉండ‌వ‌చ్చు. మ‌రో విధంగా, ర‌జ‌నీ కూడా ఇటీవ‌ల సినిమాల‌కు కాస్తంత విశ్రాంతి ఇచ్చి రాజ‌కీయ‌ప‌రంగా త‌న స్నేహితుల‌ను ద‌రిచేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఆహ్వానాన్ని త‌ప్ప‌కుండా స్వీక‌రించితే త‌న స్థాయిని పెంచుకోవ‌డంతో పాటు, త‌న‌కు త‌మిళ‌నాట  పెరుగుతోన్న రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌కు అడ్డుక‌ట్ట వేయ‌చ్చ‌న్న ఆలోచ‌నా చేసి ఉండ‌వ‌చ్చు. క‌నుక త‌మిళ నాట ర‌జ‌నీ ఫాన్స్‌కి ఇదో శుభ‌వార్తే అవుతుంది. ర‌జ‌నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అరుణాచ‌లం, భాషా, బాబా,ముత్తు వంటి సినిమాలు ర‌జ‌నీని ఆధ్యాత్మిక గురువుగానూ మ‌రో కోణంలో అభిమానులు ద‌ర్శించారు. 

ఇదిలాఉండ‌గా, గతంలో ఆధ్యాత్మిక చింత‌న భారంతోనే ర‌జ‌నీ అనేక రాజ‌కీయ అంశాల‌మీద ఎలాంటి ఆరోప‌ణ‌లు, విమర్శ‌లూ చేయ‌లేదు. అయితే రాజ‌కీయ‌విశ్లేష‌కులు మాత్రం అదంతా న‌ట‌నే, బీజేపీ, కేంద్ర నాయ‌క‌త్వాన్ని ఆక‌ట్టుకోవ‌డంలో ర‌జ‌నీ వేసిన ఎత్తుగ‌డే త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ముఖ్యంగా జ‌మ్ము కాశ్మీర్ అంశంలో ర‌జ‌నీ ఎలాంటి కామెంట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్రంలో బీజేపీ నాయ‌క‌త్వాన్ని సీనియ‌ర్ నాయ‌కుల‌ను భ‌జ‌న చేయ‌డం కూడా జ‌రిగింది. చాలా కాలం క్రిత‌మే అమిత్‌షాను పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తారు ర‌జ‌నీ. మీరు పార్ల‌మెంటులో చేసిన భాష‌ణ మ‌హాద్భుతం.. ఎవ‌రివ‌ల్లా కాదు మిత్ర‌మా అంటూ పొగిడేశారు. అంత‌టితో ఆగ‌లేదు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షా ల జంట మ‌హాభార‌తంలో  కృష్ణార్జునుల వంటిదని ర‌జ‌నీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వీరిద్ద‌రి వ‌ల్లే దేశం ఊహించ‌ని  అభివృద్ధి దిశ‌లో వెళుతోంద‌ని దేశ‌మంతా వినిపించేలా ప్ర‌శంసించారు.  2018లో తూత్తుకుడిలో యాంటీ స్టిరెటైట్ ప్రొటెస్టుల సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌లు, అల్ల‌ర్ల‌ను ర‌జ‌నీ వ్య‌తిరేకించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన పోలీసు కాల్పుల్లో ఏకంగా 13మంది చ‌నిపోయారు. జూలైలో నెటిజెన్లు శాంతాకుళం లో ఇద్ద‌రు వ్యాపారుల మ‌ర‌ణం గురించి నెటిజ‌న్లు హోరెత్తితే ఇక త‌ప్ప‌ని స్థితిలో ర‌జ‌నీ కామెంట్ చేయ‌వ‌ల‌సి వ‌చ్చిందే గాని, కేంద్రం ఏమ‌నుకుంటుందోన‌న్న భీతి ఆయ‌న‌లో లేక‌పోలేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల మీద సామాన్య‌జ‌నులూ విరుచుకుప‌డుతున్న త‌రుణంలో, విప‌క్షాలు మండిప‌డుతున్న స‌మ యంలోనూ ర‌జ‌నీ అంత‌గా స్పందించ‌లేదు. ఆయ‌న ఆధ్యాత్మిక చింత‌న సారాంశం కేవ‌లం కేంద్రం లోని బీజేపీవారిని ఆక‌ట్టుకోవ‌డానికే అన్న విమ‌ర్శ‌లూ ర‌జ‌నీ ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింది.

ఏతావాతా తేలిందేమంటే, ర‌జ‌నీకాంత్ కేవ‌లం భారీ డైలాగ్‌ల‌తో పెద్ద ఎత్తున జ‌నాక‌ర్ష‌క నాయ‌కునిగా ఆరాధ్య‌దైవంగా నిల‌బ‌డ‌ట‌మే కాకుండా త‌న‌లోప‌లి క‌మ‌ల‌నాథుడిని కూడా కాపాడుకోవ‌డానికి స్వీయ ఎత్తుగ‌డ‌లు క‌నిపించి క‌నిపించ‌కుండా చేప‌ట్టి ఢిల్లీ ప్రయాణాలు, ఆహ్వానాల‌కు మోదీ, షాల‌తో  ములా ఖ‌త్‌ల‌కు ట్విస్ట్ .. తన‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ అంటగ‌ట్టే అనుకూల‌త సాధించ‌డ‌మేన‌ని విశ్లేష‌కుల మాట‌.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.