బీహార్ లో బీజేపీకి బిగ్ షాక్?

Publish Date:Aug 8, 2022

Advertisement

బీజేపీకి బీహార్ లో నితీష్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కు జెల్ల కొట్టి విపక్ష ఆర్జేడీ మద్దతుతో, వామపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.

బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో నెల రోజుల కిందట ఏర్పడిన చిచ్చు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం (ఆగస్టు 9)న జేడీయూ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర్రంలో ఈ నెల 11 నాటికి కొత్త సర్కార్ ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

జేడీయూ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీసింగ్ గత శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య బంధం దాదాపు చెడినట్లేనని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర కేబినెట్ లో ఆర్పీసింగ్ కు స్థానం కల్పించడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కనీసం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామ్య పక్ష అధినేత అయిన నితీష్ ను కనీసం సంప్రదించలేదు. దాదాపు ఏకపక్షంగా ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు.

దీంతో అప్పటికి ఊరుకున్న నితీష్ కుమార్ ఆ తరువాత తాజాగా ఆయన రాజ్య సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. దీంతో అనివార్యంగా ఆర్పీ సింగ్ కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. నితీష్ అక్కడితో ఆగకుండా ఆర్పీసింగ్ కుమార్తె అవినీతిపై ప్రశ్నించడంతో అనివార్యంగా ఆర్పీసింగ్ జేడీయూ నుంచి రాజీనామా చేశారు. 2017లో లాలూ అవినీతిని ఎత్తిచూపుతూ.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ.. 2020 ఎన్నికల్లో లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా బరిలోకి దిగింది. ఎన్డీయే కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చినా, జేడీయూగా మాత్రం బారీగా నష్టపోయి కేవలం  43 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 74 స్థానాలు సాధించింది.

అయితే సంకీర్ణ ప్రభుత్వాధినేతగా  బీజేపీ, నితీశ్‌కే అధికారాన్ని కట్టబెట్టింది. అదే సమయంలో  బిహార్‌పై పట్టుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గమనించిన నితీష్ కుమార్   తెగదెంపులకు సిద్ధమయ్యారు. నెల రోజులుగా ఆయన బీజేపీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.  ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతిఆయోగ్‌ సమావేశానికి,   అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జులై 17న అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి, రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి, గత నెల 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి నితీశ్‌ గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే (ఆగస్టు 9)మంగళవారం నితీశ్‌ తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం రాజకీయంగా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇప్పటికే  75 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆర్జేడీ మద్దతు నితీశ్‌కు ఉంటుందని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రకటించారు. బీజేపీని కాదనుకుంటే.. మద్దతివ్వడానికి తాము సిద్ధమని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. సీపీఐ(ఎంఎల్‌)-లెనిని్‌స్టకు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో రెండేసి సీట్లున్నాయి. నితీశ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. మరోవైపు నితీశ్‌తో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ.. ఫోన్‌లో మాట్లాడారనే ప్రచారం జోరందుకుంది.

243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరం. మరో వైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. ఒక వేళ ఎన్డీయే నుంచి నితీష్ వైదొలగి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైతే ఆర్జేడీలో చీలిక తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా లేని పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏ క్షణంలోనైనా బీజేపీ, జేడీయూ కటీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.