ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు : బండి సంజయ్
Publish Date:Sep 20, 2026
Advertisement
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని అన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిం చిందని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫాంహౌజ్ వ్యవహారంపై కూడా బండి సంజయ్ స్పందించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిదని నిలదీశారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. భూదోపిడీ జరిగితే ఆధారాలతో సహా బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూముల స్వాధీ నంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌజ్‌ను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ అధికార పార్టీ ఫాంహౌజ్ ను సందర్శించడం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిం చారు.రాష్ట్రంలో 22ఏ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని బండి సంజయ్ అన్నారు. ప్రజల సమస్య లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తా మని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీ కానేకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవా లను ప్రశాంతంగా నిర్వహించుకుందామని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. భక్తిశ్ర ద్ధలతో ఉత్సవాలను జరుపుకోవడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు. [ Bandi Sanjay Kumar, Congress party, Supreme Court, BJP, BRS, Danam Nagender, Khairatabad by-election, CM Revanth reddy ]
http://www.teluguone.com/news/content/bandi-sanjay-kumar-25-231970.html




