వాళ్ల ఎంట్రీతో.. మేకపాటి కుటుంబంలో రాజ‌కీయ కల్లోలం!

Publish Date:Apr 5, 2022

Advertisement

రాజకీయ నాయకుల కుటుంబాల్లో నిన్నటి వరకు మేకపాటి ఫ్యామిలీ ఓ వెలుగు వెలిగింది. మేకపాటి కుటుంబంలోని వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, మంత్రిగా పదవులను అధిరోహించారు. అలాంటి మేకపాటి కుటుంబంలో నెలకొన్న కలహాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకప్పుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి పారిశ్రామికంగా, రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే.. తాజాగా ఆ కుటుంబంలో పొడచూపిన కలహాలతో ఆ పరువు కాస్తా గంగలో కలిసినట్లయింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటూ.. తమ కుటుంబం రాజకీయంగా మరింతగా ఎదిగేందుకు ఊతం ఇచ్చారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మేకపాటి కుటుంబంలో కలహాలు ఒక్కసారిగా వెలుగులో చూశాయి. ఈ మధ్య కాలంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే కుటుంబానికి చెందిన మేకపాటి మేనల్లుడు బిజివేముల రవీంద్రారెడ్డి మేనమామాల కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దాంతో మేకపాటి కుటుంబంలో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న కలహాలు బయటపడడానికి దారితీశాయి.

మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిత మృతితో ఖాళీ ఏర్పడ్డ నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో వారి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలనే సందిగ్ధత నెలకొంది. గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉండగా.. రాజమోహన్ రెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో మామా కోడళ్ల మధ్య అంతర్గత విభేదాలున్నట్లు రాష్ట్రమంతటా ఓ రేంజ్ లో చర్చ జరిగింది.

ఇదిలా ఉండగా.. తగుదునమ్మా అంటూ మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆ కుటుంబానికి మరింత తలనొప్పిగా మారారట. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య నేనున్నానంటూ ప్రత్యక్షంగా బయటికి రావడం, అధికార కార్యక్రమాల్లో పాల్గొని తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం బరిలో దిగుతానంటూ సంకేతాలు ఇచ్చారు. మేకపాటి కుటుంబంపై తాను పోటీ చేస్తానంటూ అదేరోజున మేకపాటి మేనల్లుడు బిజివేముల రవీంద్రారెడ్డి ప్రకటించడంతో ఆ కుటుంబంలో రాజకీయంగా అల్లకల్లోలం సృష్టించింది.

ఒక పక్కన మామా కోడళ్ల మధ్య విభేదాలు.. అది చాలదన్నట్లు చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య.. వీరంతా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోకుండానే లోపల్లోపల కత్తులు దూసుకుంటున్నార‌ని అంటున్నారు. ఇదంతా మేకపాటి కుటుంబ రాజకీయ ప్రస్థానంపై పెద్ద మచ్చగా మారింది. ఒకప్పుడు మేకపాటి కుటుంబం ఆర్థికంగా, రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ ఆ కుటుంబంలో ఒక్క మరణంతో వారి పరువు కాస్తా పెన్నానదిలో కలిసినట్లయింది. మేకపాటి కుటుంబంలో జరుగుతున్న చిత్ర విచిత్రాల గురించి జిల్లా ప్రజలు, వైసీపీ నేతలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అన్నదమ్ముల మధ్య ఇంత లొల్లి ఉందా? అని చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక మేకపాటి కుటుంబానికి సవాల్ గా లేనప్పటికీ మంత్రి పదవి దక్కించుకోవాలనే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరాటం కాస్తా కుటుంబంలో ఏర్పడ్డ విభేదాల కారణంగా బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు. నిన్నటి దాకా మేకపాటి కుటుంబానికే మంత్రి పదవి ఖాయమని చర్చించుకుంటున్న జనం.. ఆ కుటుంబంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారికి అడ్డంకిగా మారుతున్నాయంటున్నారు. చేతి వరకూ వచ్చిన మంత్రి పదవి ఇక చేజారినట్లే అని నెల్లూరు జిల్లాలోని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజకీయంగా మేకపాటి కుటుంబం ఖేల్ ఖతం అని ఆ కుటుంబ సభ్యులే చెప్పకనే చెప్పినట్లు అయిందనే వ్యాఖ్యలు జిల్లా ప్రజలు, వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.