కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనకు విరామం ప్రకటించింది. ఆ పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇందుకు సంబంధించి స్వయంగా ప్రకటించారు.  దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.  పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు,  మద్దతుదారులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపేందుకు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.  సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ణానేశ్వర్ కుమార్ రాజీనామా సహా పలు   ప్రజా సమస్యలపై రాజధాని ఢిల్లీలో సీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు,  పోలీసుల అణచివేత కారణంగా పలువురు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కార్యకర్తల కుటుంబాలపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయనీ, అందుకే కార్యకర్తలు, నాయకులు  పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు ఈ తాత్కాలిక విరామ నిర్ణయం తీసుకున్నట్లు అభిజీత్ దీప్కె పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పార్టీ ప్రముఖ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్టులు,  జ్యుడీషియల్ కస్టడీ గురించి అభిజీత్ దిప్కే ప్రస్తావించారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జైలులో గడిపినప్పటికీ వారి మొహంలో ఎలాంటి భయం కనిపించలేదని, వారి ధైర్యసాహసాలు పార్టీ శ్రేణులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని   కొనియాడిన ఆయన  చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజా సమస్యలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తామన్నారు.   [Cockroach Janata Party Gives Break Agitation, Diwali Protest Pause, CJP Agitations, Telugu One] 
రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోయాక మరో మాట వినిపించడం కొత్తేమీ కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడే నాయకులు   వైఖరిని మరచిపోయి మాట్లాడటం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చుట్టూ సాగుతున్న వివాదం.. ఈ వివాదం విషయంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై రాజకీయవర్గాలలోనూ, నెట్టింటా కడా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది.  స్థానిక నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారనీ, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్న విషయం..  అన్నది ఆధారాలు, అధికారిక విచారణ తేలుస్తుంది. అ విషయం పక్కన పెడితే.. జగన్ గతంలో అంటే ఆయన అధికారంలో ఉండగా ఎన్నికల వ్యవస్థలతో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  అరాచకాలు జరిగాయని జగన్ చెప్పడాన్నితప్పుపట్టడం లేదు కానీ, జగన్   అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన విమర్శలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన చేస్తున్న ఫిర్యాదులకు ఒకే కొలమానం వర్తిస్తుందా? ప్రజాస్వామ్యంపై ఆవేదన వ్యక్తం చేసే నాయకుడి మాటలకు విశ్వసనీయత రావాలంటే, గతంలోనూ అదే సూత్రాలకు కట్టుబడి ఉండాలి, లేదా ఉన్నట్లు కనిపించాలి.. కానీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చేస్తున్న విమర్శలు ఫిర్యాదులప పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. తనదాకా వస్తే కానీ.. అన్న సమేతను గుర్తు చేస్తున్నదని అంటున్నారు.  స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి పోటీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణుల్లో కనిపించని ఉత్సాహం. పార్టీ నాయకుల ఉదాశీనత.  మేయర్లు, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలులో ఉండటం కూడా వైసీపీలో పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేయడానికి ఒక కారణంగా పరీశీలకులు విశ్లేషిస్తున్నారు.   2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి, తిరుపతి తదిత ప్రాంతాల్లో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.  నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, దాడులు జరిగాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మరోవైపు, కూటమి నాయకులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డంకులను ప్రస్తావిస్తూ ప్రతివిమర్శలు చేస్తున్నారు.    ఇప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రత, ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, నిష్పక్షపాత ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతున్న జగన్.. గతంలో అంటే తాను అధకారంలో ఉన్న సమయంలో అప్పటి   రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పట్ల వ్యవహరించిన తీరుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.  ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారాలపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లింది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థల గౌరవం గురించి జగన్ మాట్లాడుతున్నప్పుడు, గతంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.   ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారు చెప్పిందే నిజమని అంగీకరించడం కాదు. ప్రతిపక్షం చెప్పిందే వాస్తవమని నమ్మడమూ కాదు. ఆధారాలు పరిశీలించి, న్యాయబద్ధమైన నిర్ణయాలకు కట్టుబడటం. జగన్ వ్యవస్థల గౌరవం గురించి మాట్లాడితే, గతంలో వాటితో జరిగిన వివాదాలపై ప్రశ్నలు రావడం సహజం. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తన పార్టీ శ్రేణుల ప్రవర్తనపైనా ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే. [AP Local Body Elections Violence, Jagan Mohan Reddy, Chandrababu Naidu, YCP, TDP,  Election Related Violence, Andhra Pradesh Politics, Telugu One]
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది. దేశ అత్యున్నత సంస్థలైన ఎన్నికల సంఘం (ECI) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థల పాత్రపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్టోరల్ రోల్స్ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ మార్పులు, ఫారమ్-6 చేరికలు వంటి అంశాలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదం కేవలం సాంకేతికపరమైనది మాత్రమే కాదు, భారతీయ ప్రజాస్వామ్య మూలస్తంభాలనే ప్రశ్నార్థకం చేసే స్థాయికి చేరింది. ఇటువంటి పలు అంశాలపై వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ విస్తృతంగా చర్చించారు. ఈ వివాదంలో ప్రధానంగా ఎన్నికల సంఘం అనుసరిస్తున్న పారదర్శకతా లోపంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితాలో మార్పులు, లాజికల్ డిస్క్రిపెన్సీలు, ఫాదర్ పేరెంటల్ లింక్ వంటి సున్నితమైన అంశాలలో టీసీఎస్ సాఫ్ట్‌వేర్ పాత్ర ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత గోప్యత, తటస్థత ఉండాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రతిపక్షాలు మరియు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు లేవనెత్తుతున్న ఆందోళనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రెస్ నోట్ల విషయంలోనూ ఎన్నికల సంఘం మరియు న్యాయస్థానం మధ్య సమన్వయం లేకపోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానాలు వ్యక్తమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది .మరోవైపు, కేంద్ర ప్రభుత్వం  అధికార పార్టీ ఈ విమర్శలను ఎదుర్కొనే తీరు కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ, దానిపై వచ్చే ప్రతి విమర్శను ప్రభుత్వమే ముందుండి ఖండించడం, లేదా రాజకీయ పార్టీలు స్పందించడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో ఫారమ్-6 చేరిక, చట్టబద్ధత లేని నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు, సాఫ్ట్‌వేర్ ద్వారా ఓట్ల తొలగింపు  పునరుద్ధరణలో ఎదురవుతున్న సాంకేతిక నిరోధాల గురించి జ్యుడీషియల్ అధికారులు, న్యాయమూర్తులు రాజీనామాలు చేయడం వంటి పరిణామాలు వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో నడుస్తున్న విచారణలు, రాబోయే ఎన్నికల సరళిపై ఇవి గట్టి ముద్ర వేయనున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటరు విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు మరియు సంబంధిత సాంకేతిక సంస్థలు పారదర్శకతను పాటించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేనిపక్షంలో, ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం సడలిపోయి, మరింత తీవ్రమైన ప్రజాస్వామ్య సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.       [ Election Commission, TCS, Democracy Crisis, Supreme Court, Political News, Telugu One, Kantamaneni Ravi shankar, Zameen Rythu Editor Dolendra Prasad, SIR, ECI ]
ALSO ON TELUGUONE N E W S
భారతీయ సినీ ప్రేమికులు, రామ భక్తులందరు కంప్లీట్ రామాయణ పార్ట్ 1  మూడ్ లోకి వచ్చేసారు. రిలీజ్ డేట్ నవంబర్ 5 కి  కౌంట్ డౌన్ కూడా మొదలవడంతో రామాయణ ఎలా ఉండబోతుందో అంటూ ట్రైలర్ ని పదే పదే చూసుకుంటూ మురిసిపోతున్నారు.  పైగా క్యారెక్టర్స్ గురించి రోజుకొక ఆసక్తికర విషయాన్నీ రివీల్ చేస్తు అభిమానులు, సినీ ప్రియుల్లో రామ జోష్ ని  తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా రామాయణ మూవీకి సంబంధించి నటీనటులు అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. మరి మనం కూడా ఒక లుక్ వేద్దాం.  రాముడైన రణబీర్ కపూర్ ఒక్కో పార్టుకి  సుమారు 75 కోట్ల రూపాయల చొప్పున, మొత్తం రెండు భాగాలకు కలిపి  150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం కావడం విశేషం. గతంలో ఆయన నటించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి 25 నుండి 30 కోట్ల రూపాయలు, అలాగే బ్లాక్‌బస్టర్ హిట్ 'యానిమల్' చిత్రానికి 30 నుండి 35 కోట్ల రూపాయలతో పాటు ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్న రణబీర్, ఇప్పుడు 'రామాయణం'తో తన రేంజ్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు. లంకానిలయ దశకంఠుడు రావణాసురుడు గా చేస్తున్న యష్ ఒక్కో భాగానికి 50 కోట్ల రూపాయల చొప్పున మొత్తం రెండు భాగాలకి  100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల సమయంలో ఆయన తీసుకున్న 30 నుండి 35 కోట్ల రూపాయల పారితోషికంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంతేకాకుండా, యష్ తన 'మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్' బేనర్ ద్వారా ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తూ లాభాల్లో వాటా పంచుకుంటున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: నయనతార 'మహాశక్తి' ట్రైలర్ వచ్చేసింది: అమ్మవారిగా లేడీ సూపర్‌స్టార్ విశ్వరూపం!   జగద్జన్మని సీతాదేవి  సాయి పల్లవి ఒక్కో భాగానికి 6 కోట్ల రూపాయల చొప్పున మొత్తం రెండు భాగాలకి కలిపి 12 కోట్ల రూపాయలని పారితోషికంగా తీసుకుందని టాక్.  తన గత చిత్రం 'తండేల్' సినిమాకు 5 కోట్ల రూపాయలు తీసుకోగా, ఇప్పుడు 'రామాయణం' ఆమె కెరీర్‌లోనే హయ్యెస్ట్.రామదూత హనుమంతుడు  సన్నీ డియోల్ 40 కోట్ల రూపాయలు (ఒక్కో భాగానికి 20 కోట్లు), లక్ష్మణుడిగా చేస్తున్న రవి దూబే 2 నుండి 4 కోట్ల రూపాయలు, కైకేయి  లారా దత్తా 3 కోట్ల రూపాయలు,  దశరథుడు అరుణ్ గోవిల్ 2.5 కోట్ల రూపాయల చొప్పున పారితోషికాలు అందుకుంటున్నట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలోనే సుమారు 4000 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న రామాయణకి  నితీష్ తివారీ దర్శకుడు.  నిర్మాత నమిత్ మల్హోత్రా.   [Ramayana Movie Cast Remunerations, Ramayana movie cast salary, Ranbir Kapoor Ramayana remuneration, Yash Ravana fee, sai pallavi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం.. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.541 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. దీంతో తమిళ సినిమా బాక్సాఫీస్ రికార్డుల జాబితాలోనూ ఈ సినిమా కీలక స్థానానికి చేరుకుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆరో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అందుబాటులో ఉన్న బాక్సాఫీస్ నివేదికల ప్రకారం, ఆరో రోజు ఇండియాలో ఈ సినిమా సుమారు రూ.45.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇందులో తమిళ వెర్షన్ నుంచి రూ.31.20 కోట్లు, తెలుగు వెర్షన్ నుంచి రూ.8.75 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు అంచనా. దసరా సెలవు కూడా వసూళ్లకు కలిసొచ్చింది. జైలర్ 2 ఓపెనింగ్ కూడా భారీ స్థాయిలో నమోదైంది. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.418.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత కూడా వసూళ్ల వేగం కొనసాగడంతో ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటింది. ఇండియాలో ఈ మూవీ రూ.337 కోట్ల గ్రాస్, రూ.287.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.541 కోట్లకు చేరింది. రూ.500 కోట్ల మార్కును దాటడంతో జైలర్ 2 ముందు ఇప్పుడు మరిన్ని రికార్డుల లక్ష్యాలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో 2.0, జైలర్, లియో టాప్-3 లో ఉండగా.. ప్రస్తుతం జైలర్ 2 నాలుగో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే టాప్-2 లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.  ‘జైలర్ 2’ 500 కోట్ల క్లబ్‌లో చేరడంతో రజినీకాంత్ మరో ఫీట్ సాధించారు. కోలీవుడ్ హిస్టరీలో ఇప్పటిదాకా 500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు ఆరు ఉండగా.. అందులో నాలుగు రజినీ సినిమాలే కావడం విశేషం. గతంలో 2.0, జైలర్, కూలీ సినిమాలతో ఈ ఫీట్ సాధించిన సూపర్‌స్టార్.. ఇప్పుడు ‘జైలర్ 2’తో నాలుగోసారి తన స్టార్ పవర్ చూపించారు.  ఇది కూడా చదవండి: బంపరాఫర్.. బుచ్చిబాబు నెక్ట్స్ సినిమా ఆ స్టార్ హీరోతోనేనా.?       [Jailer 2 Box Office Collection, Jailer 2 Worldwide Collection, Jailer 2 Day 6 Collection, Jailer 2 500 Crore, Jailer 2 Telugu Collection, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh, Telugu Film News]  
దర్శకుడు బుచ్చిబాబు సానా తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? పెద్ది తర్వాత ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ విషయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో బుచ్చిబాబు సినిమా ఉంటుందనే ప్రచారం ఒకవైపు నడుస్తుండగా.. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్యతో ఆయన ఓ యాక్షన్ డ్రామా చేయనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు.. ఈ ఏడాది రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కించిన పెద్ది సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో పనిచేస్తారనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ వినిపించారని, ఆ కథ ఆయనకు నచ్చిందని గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సమయం పట్టవచ్చని టాక్. ఈలోగా మరో కథతో సినిమా ప్రారంభించాలని బుచ్చిబాబు ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా ప్రచారం ప్రకారం.. బుచ్చిబాబు తమిళ హీరో సూర్యకు ఓ కథ వినిపించినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిగా భిన్నమైన కథాంశంతో, పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని వినికిడి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.  చిరంజీవి, సూర్యలకు బుచ్చిబాబు చెప్పిన కథలు రెండూ వేరని తెలుస్తోంది. చిరంజీవి మూవీ ఆలస్యమైతే ముందుగా సూర్య సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అంటున్నారు. దీంతో బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ చిరంజీవితో ఉంటుందా? లేక సూర్యతోనా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: 175 డేస్ రికార్డు.. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన టాప్10 సినిమాలు ఇవే.!       [Buchi Babu Sana Next Movie, Suriya Buchi Babu Movie, Chiranjeevi Buchi Babu Movie, Peddi Director, Buchi Babu Sana, Chiranjeevi, Suriya, Telugu Film News]  
  హీరో కట్ అవుట్ కి ఏ మాత్రం తీసిపోకుండా  మూడుదశాబ్దాలపై నుంచి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ తో దూసుకుపోతున్న తార.. నయనతార.. హిట్ మాత్రమే తన కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మార్చుకొని ఇప్పుడు టైటిల్ రోల్ లో 'మహాశక్తి' తో సెల్యులాయిడ్ ని  తన వశం చెయ్యడానికి రెడీ గా ముస్తాబవుతోంది. తమిళ టైటిల్ మూకుతి అమ్మన్ పార్ట్ 2 . తాజాగా 'మహాశక్తి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  రెండు నిమిషాల ఇరవై నాలుగు నిమిషాల నిడివితో విడుదలైన ట్రైలర్, అలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూస్ నా చిరునామా అంటూ దూసుకుపోతూ ఉంది. ట్రైలర్ విషయానికి వస్తే, ప్రారంభం నుంచే గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సాగుతు  అమ్మవారి దివ్యమైన రూపంలో నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.  దీంతో భక్తులను రక్షించే దైవిక శక్టర్‌గా ఆమె అభినయం ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం డివోషనల్ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా, సరికొత్త మిస్టరీ మరియు అద్భుతమైన ఫాంటసీ హంగులతో ఈ చిత్రాన్ని మలిచారు. ముఖ్యంగా ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా అత్యంత శక్తివంతమైన మంత్రగత్తె పాత్రలో నటిస్తుండగా, ఆమె లుక్స్ మరియు మేకోవర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నయనతార, రెజీనాల మధ్య వచ్చే శక్తిమంతమైన పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. వీరితో పాటు కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన యోగిబాబు మరియు ప్రముఖ నటి ఊర్వశి తమదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే కథలో కీ రోల్స్  పోషిస్తున్నారు.   ఇది కూడా చదవండి: రణబాలి 2 కథ లీక్: ఇది ఆ దర్శకుడి పనేనా!   ప్రముఖ దర్శకుడు సుందర్. సి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై డా. ఇషారి కె. గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దీనిని కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నవంబర్ 6, న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  గ్రాండ్‌గా విడుదల కానుంది.  హిట్ బొమ్మ 'మూకుతి అమ్మన్' కి  సీక్వెల్ అనే విషయం తెలిసిందే.      [Nayanthara Mahasakthi Trailer, Mahasakthi movie, Nayanthara Mahasakthi, Mookuthi Amman 2, Sundar C direction, Regina Cassandra, Mahasakthi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
  విజయ్ దేవరకొండ, రష్మిక, మైత్రి మూవీ మేకర్స్,  రాహుల్ సాంకృత్యాన్  ప్రస్తుతం 'రణబాలి' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.  విజయ్ తో పాటు ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేసినా ప్రేక్షకుల మూడ్ ని క్యాచ్ అయ్యేలా కథనం ఉండి ఉంటే రణబాలి మరింత బెటర్ పొజిషన్ లో ఉండేదనే మాటలు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ లోకి అడుగుపెట్టినట్టుగా బాక్స్ ఆఫీస్ లెక్కలు చెప్తున్నాయి. అయితే రణబాలికి  సీక్వెల్ వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతు 'రణబాలి’కి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీసే ఆలోచన ఉంది. రణబాలి తండ్రి, జయమ్మ, గౌడప్పల గత జీవితాల ఆధారంగా ఈ ప్రీక్వెల్ కథని  రూపొందించాలని భావిస్తున్నాను. వారి జీవితాలను రణబాలి విధికి, అతని కుమారుడి భవిష్యత్తుకు మరియు పోర్టు నుంచి తప్పించుకున్న బ్రిటిష్ వ్యక్తి కథకి  ముడిపెడుతూతెరకెక్కించనున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఇది కూడా చదవండి: శంకర్ కి బిగ్ షాక్: ఇండియన్ 3 ప్రపోజల్ రిజెక్ట్ చేసిన ఆ అగ్ర నిర్మాణ సంస్థ!   దర్శకుడి ఈ ప్రకటనతో విజయ్, రష్మికల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ప్రస్తుతం హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల ‘రణబాలి’ ప్రీక్వెల్ పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండచ్చనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  ప్రీక్వెల్ అంటే ముందు జరిగిన కథ అనే విషయం తెలిసిందే.     [Rahul Sankrityan About Ranabaali 2, Ranabaali Collections, Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabaali box office,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]     
Yash is winning praise for his screen presence in Ravana Thandava, the latest musical release from Nitesh Tiwari’s Ramayana. However, A.R. Rahman’s composition has received a mixed response, with listeners divided over the song’s tune despite appreciating the visuals and Yash’s commanding portrayal of Ravana. The makers released the song late on October 20, coinciding with international timings and the Dussehra festivities. The song showcases Ravana’s devotion to Lord Shiva through an intense Tandava sequence, with Yash’s expressions, physicality and imposing screen presence emerging as major talking points. Vishal Dadlani has lent his voice to the song, while Dr. Kumar Vishwas has penned the lyrics. The film’s soundtrack is composed by A.R. Rahman and Hans Zimmer. Listeners who heard the complete song have described it as another slow poison from Rahman, suggesting that the composer’s music often reveals its deeper layers when experienced alongside the film’s visuals. However, others believe the tune lacks the impact expected from such a grand sequence. Some have even compared it with Adipurush, remarking that Ramayana’s visuals look top-notch, but the music of Prabhas’ Adipurush would have suited these visuals better. With opinions divided over the composition, the song has generated discussion rather than unanimous appreciation. Yash’s screen presence, meanwhile, appears to be winning over viewers, adding to the anticipation surrounding his portrayal of the Lankan king. Starring Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, Ravi Dubey as Lakshmana and Sunny Deol as Hanuman alongside Yash as Ravana, Ramayana is produced by Namit Malhotra, with Yash co-producing it through Monster Mind Creations. The film also features an ambitious visual effects effort from DNEG and is directed by Nitesh Tiwari. The makers have also opened advance bookings for the film across India and the movie is scheduled for 5th November release worldwide. Even though, the response appears to be mixed, Ravana Thandav song has proved that the ambitious visual scale of the film is complimented by extreme efforts of actors. We have to wait and see, how everything translates on the big screens.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
  సినిమాతో పాటు సినీ ప్రేక్షకులకి అప్ డేట్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే అప్ డేట్ సినిమాలు తీసిన దర్శకుడు శంకర్.  శంకర్  అప్ కమింగ్ మూవీ ప్రదర్శిస్తున్న ట్రైలర్ చూడటం కోసమే ఒక సినిమాని రిపీట్ గా చూసిన  ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం డిజాస్టర్స్ ని అందిస్తూ అభిమానులు, ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇండియన్ 3 తో థట్ ఈజ్ శంకర్ అనిపించాలనే పట్టుదలతో ఉన్నాడు.    అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సౌత్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న  వార్త హాట్ టాపిక్‌గా మారింది. గతంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఇండియన్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం, 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కికేవలం 148 కోట్ల వసూళ్లతో నిరాశపరచడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఇండియన్ 3' పై నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 75 శాతం మేర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అయితే, సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు శంకర్ మరో 25 రోజుల పాటు అదనపు షూటింగ్ జరపాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షాన్స్‌ను కోరినట్లు తెలుస్తోంది. కానీ, 'ఇండియన్ 2' ఫలితం కారణంగా భారీ నష్టాలని  చవిచూసిన లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫుటేజ్ సినిమాని పూర్తి చేయడానికి సరిపోతుందని, దీనికోసం అదనంగా కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ షూటింగ్ చేయాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.  ఇది కూడా చదవండి:  నా బట్టలు, నా శరీరం, నా ఇష్టమంటున్న ప్రముఖ హీరోయిన్: వాళ్ళకి సిగ్గుండాలి!     సేనాపతి పూర్వ చరిత్రని , ముఖ్యంగా వీరశేఖర బచారామ్ కథని ఆధారంగా చేసుకుని ఈ మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కావడంతో పాటు, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ మరియు గ్రాఫిక్స్ పనులను త్వరగా ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.'వార్ మోడ్' అంటూ ఇటీవల చిత్ర యూనిట్ పోస్టర్లను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మళ్లీ పెరిగాయి. అయితే, శంకర్ కోరినట్లు అదనపు షూటింగ్ రోజులు కేటాయించకుండా, ఉన్నంతలో సినిమాని ఎలా ఫినిష్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత చిత్రాల అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. ఉలయనాయగన్ కమల్ హాసన్ నట విశ్వరూపం చూడటానికి ఫ్యాన్స్, ప్రేక్షకులైతే ఫుల్ వెయిటింగ్.    [Indian 3 Shankar Proposal Rejected, Indian 3, Kamal Haasan, Shankar, Lyca Productions, Indian 2 box office, Senapathy, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]    
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘వారణాసి’ని ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందిస్తున్నట్టుగా అనిపిస్తోందని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘వారణాసి’ టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అన్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో కేవలం సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలకే పరిమితం కాకుండా.. పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీని కూడా జక్కన్న మేళవిస్తున్నారట. అంతేకాదు, కథలో భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధంతో పాటు.. ఓ యువతీయువకుడి మధ్య సాగే అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందని రాజమౌళి తెలిపారు. అంటే భారీ యాక్షన్‌ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్‌ మాత్రమే కాకుండా.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే కథ కూడా ‘వారణాసి’లో కీలకంగా ఉండబోతోందన్నమాట. ఇక ‘వారణాసి’ చూస్తుంటే ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించిన అనుభూతి కలుగుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. విభిన్నమైన అంశాలు, భిన్నమైన ప్రపంచాలు, రకరకాల భావోద్వేగాలను ఒకే కథలో భాగంగా చూపించడం తనకు అతిపెద్ద సవాలుగా అనిపించిందని వెల్లడించారు. సాధారణంగా ఒక కథలోని ప్రధాన అంశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ చేయడమే దర్శకుడికి కీలకం. అలాంటిది టైమ్‌ ట్రావెల్‌, పౌరాణిక ఫాంటసీ, తండ్రీకొడుకుల అనుబంధం, ప్రేమకథ.. ఇలా విభిన్నమైన అంశాలను ఒకే కథలో కలిపి, వాటి మధ్య సమతుల్యతను కాపాడటం అంత సులభం కాదు. అందుకే రాజమౌళి ఈ సినిమాను తనకు సవాలుగా అభివర్ణించినట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: షాకింగ్ రెమ్యునరేషన్.. అనిరుధ్‌ను మించిపోతున్న సాయి అభ్యంకర్.!       [Varanasi Movie Story, SS Rajamouli Varanasi, Mahesh Babu Varanasi, Varanasi Movie Update, Rajamouli Interview, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]  
హీరోయిన్... అభిమానులు,ప్రేక్షకుల దృష్టిలో స్వర్గ లోకం నుంచి దిగొచ్చిన దేవత. మేకర్స్  తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టు క్యారక్టర్ కోసం రొమాంటిక్ గా కనిపిస్తుంది. ఫంక్షన్స్ లో కూడా తనకి నచ్చిన విధంగా బట్టలు ధరిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల కొంత మంది సోషల్ మీడియా వేదికగా  హీరోయిన్ల శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం, వారి ఫొటోలు, వీడియోలని  వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటుతున్నారనేది కూడా నిజం. తాజాగా ఇలాంటి బాడీ షేమింగ్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఘాటుగా స్పందించింది. తన శరీరం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలను వైరల్ చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నా శరీరం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది  ఆ హీరోయిన్ ఎవరో కాదు. పాయల్ రాజ్‌పుత్. ఎక్స్‌ వేదికగా తను స్పందిస్తూ 'మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి” అని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: Tiger Shroff: టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపింది వీళ్ళే: ఇద్దరు మహిళలు, ఒక మైనర్ బాలిక!    పాయల్ రాజ్‌పుత్ సినీ జర్నీ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఆర్ ఎక్స్ 100 , మంగళవారం తో అభిమానుల హార్ట్ బీట్ గా మారింది. నిత్యం ఈ రెండు సినిమాలు చూస్తూ ఉండే వాళ్ళ నంబర్స్ ని కౌంట్ చెయ్యడం కూడా కష్టం. తన కొత్త సినిమా కోసం వెయిటింగ్. ఇక పాయల్ చెప్పినట్టుగా తన బట్టలు, తన శరీరం తన ఇష్టమని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా  కామెంట్స్ చేస్తున్నారు.   https://x.com/starlingpayal/status/2112619985474605372 [Payal Rajput Hit back strongly at online trolls who body shamed her, Payal Rajput latest tweet, payal Rajput latest News]
టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. ఒకప్పుడు అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తే.. ఇప్పుడు సాయి అభ్యంకర్ కూడా అదే స్థాయిలో చర్చకు వస్తున్నారు. తక్కువ సమయంలోనే వరుస చార్ట్‌బస్టర్ పాటలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యువ సంగీత దర్శకుడు.. ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ (OM) సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన సుమారు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి అభ్యంకర్ రెమ్యునరేషన్ కంటే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఆడియో హక్కుల బిజినెస్. ‘ఓం’ సినిమా ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకు వచ్చిన మొత్తం.. సాయి అభ్యంకర్ పారితోషికాన్ని పూర్తిగా కవర్ చేయడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, విడుదలైన కొన్ని పాటలతోనే మ్యూజిక్ లేబుల్ తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత పాటలు ఎంత హిట్ అయ్యాయనే దానిపై సంగీత దర్శకుడి మార్కెట్ ఆధారపడేది. ఇప్పుడు మాత్రం పాటలపై ముందుగానే ఏర్పడుతున్న క్రేజ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ఆదరణ, ఆడియో హక్కులకు లభించే ధరలు కూడా సంగీత దర్శకుడి డిమాండ్‌ను నిర్ణయిస్తున్నాయి. సాయి అభ్యంకర్ విషయంలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సాయి అభ్యంకర్ పేరు ఇంత వేగంగా పాపులర్ కావడానికి ఆయన ఇండిపెండెంట్ ఆల్బమ్‌లే ప్రధాన కారణం. ‘కచ్చి సెరా’, ‘ఆస కూడ’ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు దక్షిణాది భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత ‘డ్యూడ్’, ‘బల్టీ’, ‘కరుప్పు’ వంటి సినిమాలతో తన సంగీత ప్రతిభను చాటుకున్న సాయి.. ఇప్పుడు ధనుష్, సూర్య, అల్లు అర్జున్ వంటి ప్రముఖ నటుల సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావడం కూడా ఆయన కెరీర్‌లో కీలకమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. సౌత్ లో అనిరుధ్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు, చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు, భారీ ఆడియో బిజినెస్‌తో ఆయన అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో చిన్న వయసులోనే భారీ ప్రాజెక్టులను అందుకుంటున్న సాయి అభ్యంకర్.. భవిష్యత్తులో ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలరా? అనే చర్చ మొదలైంది. ఇది కూడా చదవండి: స్పిరిట్ డేట్‌కు ఎల్లమ్మ.. పాన్ ఇండియా షేక్ అవుతుందా.?       [Sai Abhyankkar Remuneration, Dhanush OM Movie, Sai Abhyankkar Songs, Sai Abhyankkar, Allu Arjun, Raaka Movie, Anirudh Ravichander, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మహిళల్లో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ లేదా చాక్లెట్ సిస్ట్ అత్యంత కీలకమైనదిగా మారుతోంది. పేరులో చాక్లెట్ అని ఉన్నప్పటికీ, దీనికి చాక్లెట్లు తినడానికి లేదా తీపి పదార్థాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎండోమెట్రియోసిస్ అనే తీవ్రమైన వ్యాధితో ముడిపడి ఉండే ఒక ప్రత్యేకమైన నీటి బుడగ లేదా గడ్డల అమరిక. సాధారణంగా గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియం అని పిలుస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పొర కణాలు గర్భాశయం వెలుపల, ముఖ్యంగా అండాశయాల పై పెరగడం ప్రారంభిస్తాయి. ప్రతి నెలా రుతుక్రమం వచ్చినప్పుడు ఈ కణాలు కూడా స్పందించి రక్తాన్ని స్రవిస్తాయి. అయితే ఈ రక్తం బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అండాశయంలోనే పేరుకుపోతుంది. కాలక్రమేణా ఆ పాత రక్తం చిక్కబడి ముదురు గోధుమ లేదా కరిగిన చాక్లెట్ రంగులోకి మారుతుంది. అందుకే దీనికి వైద్యపరంగా చాక్లెట్ సిస్ట్ అని పేరు వచ్చింది. ఈ సమస్య బారిన పడిన మహిళల్లో అనేక రకాల శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తట్టుకోలేని తీవ్రమైన నడుము, కడుపునొప్పి రావడం ఈ సమస్య ప్రధాన లక్షణం. రుతుక్రమం సరిగా రాకపోవడం లేదా అధిక రక్తస్రావం కావడం వంటి క్రమం లేని పీరియడ్స్ సమస్యలు బాధితులను నిత్యం వేధిస్తాయి. అంతేకాకుండా శారీరక కలయిక సమయంలో తీవ్రమైన అసౌకర్యం లేదా నొప్పి అనిపించడం జరుగుతుంది. ఈ చాక్లెట్ సిస్ట్ సమస్య మహిళల్లో గర్భధారణపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అండాశయంలో అండాల విడుదల లోపించడం వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. పెళ్లి అయిన కొత్తలో లేదా పిల్లల కోసం ప్రయత్నించే సమయంలో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురుకావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణంగా వైద్యులు నిరూపిస్తున్నారు. అయితే ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సులభంగా అధిగమించవచ్చు. సిస్ట్ పరిమాణం చిన్నదిగా ఉన్నప్పుడు హార్మోనల్ మందులు మరియు పెయిన్ కిల్లర్స్ ద్వారా నొప్పిని, సిస్ట్ ఎదుగుదలను అదుపు చేస్తారు. ఒకవేళ సిస్ట్ పరిమాణం పెద్దదిగా ఉన్నప్పుడు లేదా తీవ్రమైన నొప్పి, సంతానలేమి సమస్యలు వేధిస్తున్నప్పుడు ల్యాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సిస్ట్‌ను సురక్షితంగా తొలగిస్తారు. చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ నిర్లక్ష్యం భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నిపుణులైన గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. సరైన సమయంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.     chocolate cyst symptoms, ovarian endometrioma causes, chocolate cyst treatment options, endometriosis ovarian cyst, pelvic pain in women, chocolate cyst fertility impact, women health reproductive issues.
ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఎముకల పటుత్వాన్ని పెంచడంలో రాగి ఆహారాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా మనం ఉదయం అల్పాహారంగా తీసుకునే మినప అట్లు కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ పోషకాలు, క్యాల్షియం రాగిలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజువారీ డైట్‌లో రెండు రాగి రొట్టెలను చేర్చుకోవడం ద్వారా ఎముకల బలాన్ని చిటికెలో తెచ్చిపెట్టుకోవచ్చు. చాలామంది రాగి రొట్టెలు గట్టిగా వస్తాయని భావిస్తారు, కానీ సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇవి ఎంతో మెత్తగా, నోరూరించేలా వస్తాయి. ముఖ్యంగా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వంటి సువాసన వెలువడే పదార్థాలు జోడించడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం వేళల్లో రుచికరమైన స్నాక్స్‌గా ఇవి అద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి. ఈ అద్భుతమైన రాగి రొట్టెలను తయారు చేయడానికి ఒక కప్పు రాగి పిండికి సరిపడా ఒక కప్పు నీటిని తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. రాగి పిండికి ఉప్పు సాధారణంగా తక్కువ పడుతుంది కాబట్టి తగినంత చూసి వేసుకోవాలి. నీరు బాగా మగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీరు తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న వేడి నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీరు మొత్తం పోయకూడదు. ఇలా వేడి నీటితో పిండిని కలపడం వల్ల రాగి పిండి చక్కగా మగ్గి, రొట్టెలు ఎంతో మెత్తగా వస్తాయి. అంతేకాకుండా, ఈ విధానం వల్ల రొట్టెలు విరిగిపోకుండా సులభంగా ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత, అందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 అంగుళం తురిమిన అల్లం వేసుకోవాలి. వీటితో పాటు అదనపు పోషకాల కోసం 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము మరియు అరకప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ కలుపుకోవచ్చు. క్యాప్సికమ్ రొట్టెకు మంచి రుచిని ఇస్తుంది, మీకు ఇష్టం లేకపోతే దానిని మినహాయించవచ్చు. వీటితో పాటు మునగాకు, మెంతికూర లేదా తోటకూర వంటి ఆరోగ్యకరమైన ఆకుకూరలను కూడా ఈ పిండిలో కలుపుకోవడం వల్ల పోషకాల విలువ మరింత పెరుగుతుంది. వేసిన పదార్థాలన్నీ పిండికి బాగా పట్టేలా చేత్తో చక్కగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా, రొట్టెలు తట్టుకోవడానికి వీలుగా మెత్తటి ముద్దలా తయారు చేసుకోవాలి. ఒకవేళ పిండి కొద్దిగా లూజ్‌గా అనిపిస్తే, మరో స్పూన్ రాగి పిండిని కలుపుకోవచ్చు. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, సిద్ధం చేసుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దను తీసుకోవాలి. బటర్ పేపర్ లేదా తడి క్లాత్‌పై ఈ ముద్దను ఉంచి, పల్చగా రౌండ్‌గా రొట్టెలా ఒత్తుకోవాలి. రొట్టె మరీ మందంగా ఉండకూడదు, ఒకవేళ మందంగా ఉంటే సరిగా ఉడకదు. చివర్లు పగుళ్లు రాకుండా జాగ్రత్తగా ఒత్తుకున్న తర్వాత, రొట్టె మధ్యలో చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె అన్ని వైపులా బాగా వేడెక్కి చక్కగా కాలుతుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాత, బటర్ పేపర్‌పై ఉన్న రొట్టెను పెనంపై రివర్స్‌లో వేసి, నెమ్మదిగా బటర్ పేపర్‌ను తొలగించాలి. మంటను లో నుండి మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుని కాల్చుకోవాలి. రొట్టె మధ్యలో చేసిన రంధ్రాలలో కొద్దిగా నూనె వేయడం వల్ల అన్ని వైపులా సరిగ్గా వేగుతుంది. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని మంచి బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలిన ఈ వేడివేడి రాగి రొట్టెలను నచ్చిన చట్నీతో వడ్డించుకుంటే ఆరోగ్యానందాలు మీ సొంతమవుతాయి.     ragi roti benefits for bones, high calcium finger millet recipes, ragi vs dosa calcium content, ragi roti for bone health, finger millet benefits, calcium rich traditional recipes, ragi health benefits.
తేనెను చాలా కాలం నుంచి ఒక దివ్యౌషధంగా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థంగా భావిస్తున్నారు. దగ్గు, జలుబు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే బరువు తగ్గించే ప్రయత్నాలలో రిఫైండ్ చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా తేనెను విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. చాలామంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడాన్ని తమ నిత్య దినచర్యలో భాగం చేసుకుంటారు. అయితే, సహజ సిద్ధమైన పదార్థం కాబట్టి దీనివల్ల ఎలాంటి హాని ఉండదని భావించడం పెద్ద పొరపాటవుతుంది. తేనెను మోతాదుకు మించి, విచక్షణారహితంగా తీసుకుంటే అది శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలతో పాటు అధిక కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి. సహజమైనదే కదా అని దీనిని అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారు తేనెను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి; లేదంటే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలాగే, చక్కెరతో పోలిస్తే తేనె కొంత మేలు చేస్తుందనే అపోహతో కొందరు దీనిని మోతాదుకు మించి వాడుతుంటారు. కానీ వాస్తవానికి తేనెలో కూడా గణనీయమైన స్థాయిలో కేలరీలు నిండి ఉంటాయి. రోజువారీ ఆహారం ద్వారా ఇప్పటికే అందాల్సిన దానికంటే ఎక్కువ కేలరీలు అందుతుంటే, అదనంగా తేనెను కూడా రోజూ జోడించడం వల్ల శరీరంలో కొవ్వు సులభంగా పేరుకుపోయి బరువు పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు సైతం తేనెను చాలా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, తేనెలో ఉండే అంటుకునే స్వభావం, అధిక చక్కెరల శాతం దంతక్షయానికి దారితీసే అవకాశం ఉంది. తేనె తిన్న తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే, నోటిలోని బ్యాక్టీరియా ఆ చక్కెరలతో చర్య జరిపి దంతాల ఎనామిల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో పాటు, తేనెలో ఉండే ఫ్రక్టోజ్ కంటెంట్ కొందరిలో సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం, కడుపునొప్పి లేదా విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత అసౌకర్యాలు తలెత్తుతాయి. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు తేనె విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భങ്ങളിൽ తేనె లేదా దానిలోని పుప్పొడి రేణువులు కొంతమందిలో అలర్జీ ప్రతిచర్యలను కలిగించి చర్మంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలకు కారణమవుతాయి. అంతకంటే ముఖ్యంగా, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పసిపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తేనె ఇవ్వకూడదు. ఇందులో ఉండే కొన్ని బ్యాక్టీరియా రేణువులు శిశువులలో ప్రాణాంతకమైన ఇన్ఫాంట్ బాటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తాయి. కాబట్టి తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నది వాస్తవమే అయినప్పటికీ, అతిగా వాడితే అనర్థాలు తప్పవు. సమతుల్యమైన జీవనశైలి కోసం తేనెను కేవలం పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం ఉత్తమం.     Why honey is dangerous for babies, infant botulism honey risk, honey for infants under 1 year, raw honey baby health risk, can babies eat honey, infant feeding safety rules, baby health precautions.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.
  శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి , చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన పెద్దలు ఎన్నో రకాల గృహ వైద్యాలను సూచించారు. అలాంటి వాటిలో నాభిలో నూనె వేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయ పద్ధతి. ముఖ్యంగా శీతాకాలం లేదా మారుతున్న కాలానికి తగినట్లుగా చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే ముందు నాభిలో కొన్ని చుక్కల ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. చర్మానికి తేమను అందిస్తుంది.. సాంప్రదాయం వైద్యంలో, ఇంటి చిట్కాలలోనూ, రోజువారీ అలవాట్ల లోనూ నాభికి నూనె రాయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఆవనూనెలో సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు బొడ్డు ప్రాంతంలో ఆవనూనెను రాసుకోవడం ద్వారా చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  పొడి చర్మానికి రక్షణ.. మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందిలో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై పీచు వలె గరుకుగా మారడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆవనూనెలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మం పైపొరను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కేవలం నాభి చుట్టూ మాత్రమే కాకుండా, ఈ నూనె రాయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల చర్మానికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తీవ్రమైన పొడి చర్మం ఉన్నవారు నేరుగా మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరింత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. పగిలిన పెదాలను రిపేర్ చేస్తుంది.. చలికాలం లేదా ఎండ తీవ్రత కారణంగా పెదవులు పగిలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. పెదవులు పగిలి రక్తం రావడం లేదా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు లేదా మూడు చుక్కల ఆవనూనె వేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయని చెబుతారు. అయితే దీనితో పాటు పెదవుల సంరక్షణ కోసం సాధారణ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణవ్యవస్థ కు మంచిది.. జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిగా ఉన్నప్పుడు పొట్ట భాగంలో గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.  మహిళల నెలసరిలో.. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తికడుపులో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతి కొంత వరకు మానసిక ప్రశాంతతను , మంచి నిద్రను ఇస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆవనూనెను నాభిలో ఎలా ఉపయోగించాలనే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు నాభి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను తీసుకుని, నాభిలో , దాని చుట్టూ ఉన్న చర్మంపై సున్నితంగా రాయాలి. దీనిని చాలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు అలాగే అతిగా నూనె పోయాల్సిన పని కూడా లేదు.  కొద్దిపాటి నూనెతో సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ ఒకేలా సరిపోతుంది అని చెప్పలేము. సున్నితమైన చర్మం ఉన్నవారికి లేదా ఆవనూనె పడని వారికి దీనివల్ల చికాకు, ఎరుపుదనం, దురద లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నూనె రాసిన తర్వాత ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే  కడిగివేయాలి. ఎలాంటి సమస్యలు లేనివారు ఈ చిట్కాను పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.                  *రూపశ్రీ.