Publish Date:Jan 28, 2022
అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నట్టుగా తయారైంది ఏపీ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ. జగన్ ను పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి కాసింతైనా ఉపశమనం పొందుదామనుకున్న జగన్ అండ కో ఆశలపై కేంద్ర సర్కారు నీళ్లు చల్లింది. దీంతో తాత్కాలికంగా జిల్లా ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతోంది. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆంధ్రా ప్రజలకు కాస్త ఉగాది పచ్చడి లాంటి తీపి, చేదు వార్తలను కలిపి పంచుదామనుకున్నారు జగన్. అయితే జూన్ నాటికి ఆ అవకాశాలు లేకుండా తయారైంది. ఇప్పుడున్న జిల్లాల సరిహద్దులను జూన్ వరకు మార్చవద్దని, కేంద్ర జనగణన డిప్యూటీ డైరెక్టర్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. రాష్ట్రాల ప్రయారిటీల కన్నా కేంద్ర ప్రభుత్వ ప్రయారిటీనే ఎక్కువ కాబట్టి సెన్సస్ విభాగం ఆదేశాలను శిరసావహించడం మినహా జగన్ బాబు చేయగలిగిందేమీ లేకుండాపోయింది. దేశమంతట నూతన గణాంకాల కోసం కోసం కేంద్ర సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే ఓటర్ లిస్టులు, నియోజకవర్గాల విభజనలు, బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే 2011 తరువాత జనాభాలో విపరీతమైన పెరుగుదల సంభవించింది. ఆయా క్లస్టర్స్ లో వివిధవర్గాల జనాభా సాంద్రతలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి తాజా సమాచారంతో పూర్తిస్థాయి జనాభా గణాంకాలు నిర్వహించేందుకు కేంద్రం రంగంలోకి దిగుతోంది.
అయితే ఈ లోపు గనక ఏ రాష్ట్రమైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తేగనక ఆయా జిల్లాల సరిహద్దుల్లో మార్పులు వస్తాయి. దీంతో లెక్కల్లో గందరగోళం సంభవిస్తుంది. అలాంటివాటికి తావు లేకుండా వచ్చే జూన్ నాటికి ఏ రాష్ట్రం కూడా కొత్త జిల్లాల జోలికి వెళ్లరాదంటూ ఆంక్షలు విధించింది. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు మరో 3 నెలలు వాయిదా పడక తప్పని పరిస్థితి తలెత్తింది.
ప్రస్తుతం 13 జిల్లాల ఏపీని.. ప్రభుత్వం 26 జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న 13 జిల్లాలు వాటి పేర్లు.. అలాగే 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికికేషన్ విడుదల చేసింది. అయితే వీటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల సమయం ఇచ్చింది. కొత్త జిల్లాలపై వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఉగాది నాటికి కొత్త నోటిఫికేషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం సూచనలతో ఆ నిర్ణయం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-break-to-new-districts-39-130848.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.