భోగాపురంలో ల్యాండ్ అయిన స్పెషల్ ఫ్లైట్.!
Publish Date:Aug 13, 2026
Advertisement
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు భోగాపురం చేరుకున్నారు. నూతన విమానాశ్రయంలో ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ కావడంతో.. వాణిజ్య విమాన సర్వీసుల నిర్వహణకు విమానాశ్రయం రెడీ అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసి.. జాతికి అంకితం చేసిన సంగతి విదితమే. ఈ విమానాశ్రయం నుంచి ఈ నెల 17 నురంచి రెగ్యులర్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగనే ఈ ప్రత్యేక విమానాల రాకపోకలు జరుగుతు న్నాయి. విమానాశ్రయ నిర్వహణ సన్నద్ధతను పరిశీలించే క్రమంలో భాగంగానే ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుండి బయలుదేరిన ఈ ప్రత్యేక విమానంలో ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు భోగాపురం చేరుకోవడం విశేషం. ఈ రన్వే పరిశీలన ప్రక్రియతో ఎయిర్పోర్టు నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాల రాకపోకలు ప్రారంభం కావడానికి ముందే.. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సాంకేతిక అంశాల పరిశీలనకు ఈ ప్రత్యేక విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చేసినట్లు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు. Bhogapuram International Airport, VisakhapatnamAirport, North Andhra Development, Bhogapuram Aircraft Landing, Bhogapuram EV Buses, Flightconetivity
http://www.teluguone.com/news/content/bhogapuram-international-airport-36-228813.html





