కేసీఆర్‌ కూతురిగా పుట్టడం జన్మజన్మల పుణ్యం.. కవిత

Publish Date:Sep 3, 2025

Advertisement

బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. తన సస్పెన్షన్ తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెబర్ 3) మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత తన రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పైనా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు. 

పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తాను ఒకేలా ఉన్నానని చెప్పిన కవిత.. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారనీ, పార్టీలో ఆరడుగులు బుల్లెట్ గా హరీష్ చెప్పుకుంటారనీ, ఆ ఆరడుగుల బుల్లెట్టే తనను గాయపరిచిందన్నారు. హరీష్ రావు వంటి వారి వల్లనే విజయశాంతి, ఈటల, మైనంపల్లి వంటి పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడారని కవిత అన్నారు. తనకు పదవులపై ఆశ లేదన్న కవిత పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. 

జన్మజన్మల పుణ్యం కారణంగానే తాను కేసీఆర్ కుమార్తెగా పుట్టానని కవిత అన్నారు. అటువంటి కేసీఆర్ ను, ఆయన పెట్టిన పార్టీనీ ఇబ్బంది పెట్టాలని తాను కలలో కూడా అనుకోనన్నారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత.. పోతే ఎంత అని తాను అనలేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ ను ఇబ్బందుల పాలు చేస్తున్న పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మాత్రమే తాను అన్నానని చెప్పారు. హరీష్ వంటి వారి వల్ల కేసీఆర్  నాయకత్వానికే కాదు.. తన అన్న కేటీఆర్ కు కూడా ముప్పు ఉందని కవిత పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న తప్పులన్నిటినీ కేసీఆర్ పై మోపుతున్నారని కవిత ఆరోపించారు. ఈ విషయంలో  కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 పార్టీలో  తనపై కుట్రలు జరుగుతుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరేం చేశారని కవిత కేటీఆర్ ను నలిదీశారు. తాను స్వయంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కూడా కేటీఆర్ స్పందించలేదని ఆరోపించారు. కొందరు కల్వకుంట్ల కుబుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కవిత.. అందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని కవిత పేర్కొన్నారు. పార్టీని హస్తగతం చేసుకోవాలన్న కొందరు పకడ్బందీగా తనను పార్టీ నుంచి బయటకు పంపారనీ, రేపు ఇదే కేసీఆర్ కు, కేటీఆర్ కు జరుగుతుందన్నదే తన ఆవేదన, బాధ అని కవిత చ చెప్పారు.  

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.