బండి సంజయ్ ఆశీర్వాద యాత్రలో తేనెటీగల దాడి

Publish Date:Mar 14, 2026

Advertisement

 

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేపట్టిన 'అంజన్న ఆశీర్వాద' పాదయాత్రలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. రామడుగు మండలం కోనరావుపేట ప్రాంతంలో యాత్ర సాగుతుండగా శుక్రవారం (14-3-26) డ్రోన్‌ కెమెరా ద్వారా ఫుటేజ్‌ తీసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈక్రమంలో చెట్టుకు ఉన్న తేనెతుట్టకు డ్రోన్‌ తగిలింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు పైకి లేచి దాడి చేశాయి. వెంటనే బండి సంజయ్‌, ఆయన సిబ్బంది అప్రమత్తమయ్యారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

తేనెటీగల దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో పాదయాత్రకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనంతరం తిరిగి మొదలైంది. బండి సంజయ్‌ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద’ యాత్ర కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు సాగనుంది. మొత్తం 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి కొండగట్టుకు బండి సంజయ్ పాదయాత్రగా కోవడంతో ఆశీర్వాద యాత్ర ముగిసింది.

By
en-us Political News

  
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.