అడోబ్ సీఈవో శంతను నారాయణ్ రాజీనామా...ఎందుకంటే?

Publish Date:Mar 14, 2026

Advertisement

 

టెక్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సీఈఓలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శంతను నారాయణ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అడోబ్ సంస్థను దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతంగా నడిపించిన ఆయన నిష్క్రమణ టెక్ పరిశ్రమలో ఒక శకం ముగింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్‌, సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపు అడోబ్‌ను మలిచిన కీలక నాయకుడిగా శంతను నారాయణ్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) పోటీ కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపిందన్న చర్చలు వినిపిస్తున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న  శంతను నారాయణ్ పదవి నుంచి తప్పుకోనున్నారనే వార్తలపై కంపెనీ స్పందించింది. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు ఆయన సీఈఓగానే కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే సీఈఓ మార్పు వెనుక ఖచ్చితమైన కారణాలు ఏమిటనేది కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. శంతను నారాయణ్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ సంస్థ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ తెలిపింది.

కొత్త సీఈఓ ఎంపిక కోసం అడోబ్ బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సంస్థలోని అభ్యర్థులతో పాటు బయటి అభ్యర్థులను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ సందర్భంగా సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోని మాట్లాడుతూ… గత 18 సంవత్సరాలుగా శంతను నారాయణ్ సంస్థ అభివృద్ధికి చేసిన సేవలు విశేషమని ప్రశంసించారు. ముఖ్యంగా ఏఐ యుగంలో అడోబ్ విజయానికి ఆయన వేసిన పునాది ఎంతో కీలకమని అన్నారు.ఇక శంతను నారాయణ్ మాట్లాడుతూ… సీఈఓగా దాదాపు 18 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. 

కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకు బోర్డుతో కలిసి పనిచేస్తూ బాధ్యతల మార్పు సజావుగా జరిగేలా చూస్తానన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో కంపెనీలో సుమారు 3,000 మంది ఉద్యోగులు ఉండగా… ఇప్పుడు ఆ సంఖ్య 30,000 మందికి పైగా పెరిగిందని తెలిపారు. అదే విధంగా కంపెనీ ఆదాయం ఒక బిలియన్ డాలర్లకు కూడా తక్కువ స్థాయి నుంచి 25 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని చెప్పారు. అడోబ్ రూపొందించిన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను చేరుకుందని గర్వంగా వెల్లడించారు.


 

By
en-us Political News

  
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది.
వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే నెపంతో.. ప్రైవేట్ వ్యక్తులు కెమెరాలతో భారత హఎచ్ 1బి వీసా ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలకు, వారి నివాసాలకూ కూడా వెళ్లి హల్‌చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నది.
ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తమకు ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని లోక్ భవన్‌కు వెళ్లారు.
ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.