Publish Date:Apr 25, 2026
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతున్న తీరుపై అధికారులతో మంత్రి నారాయణ శనివారం (25-4-26) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్లు భార్గవ తేజ, కార్తీక్, డిప్యూటీ కలెక్టర్లు, ఎమ్మార్వోలు హాజరయ్యారు.
ఇంటర్ నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వేలైన్, రైల్వేస్టేషన్ కోసం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఎంజాయ్‌మెంట్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, లెగసీ వేస్ట్, ఫ్రెష్ వేస్ట్ నిర్వహణ ఏజెన్సీలతో పలు కీలక అంశాలపై మంత్రి నారాయణ చర్చించారు. లెగసీ వ్యర్థాలను త్వరితగతిన పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఫ్రెష్‌వేస్ ప్లాంట్‌ల ఏర్పాటు త్వరగా పూర్తి చేసి వ్యర్థాల నిర్వహణ ప్రారంభించాలని సూచించారు. ప్లాంట్‌ల ఏర్పాటుకు స్థలం ఇబ్బందిగా ఉన్న చోట కలెక్టర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-narayanas-good-news-for-amaravati-farmers-36-218285.html
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.