బ్యాంకాక్ పబ్‌లో భీకర అగ్నిప్రమాదం: క్షణాల్లో 27 మంది సజీవదహనం!

Publish Date:Jul 13, 2026

Advertisement

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్యాంకాక్‌లోని ఒక లైవ్ మ్యూజిక్ పబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోయ్ లాట్ ప్రావో 1 రోడ్డు సమీపంలోని ప్రసిద్ధ ‘నా లాడ్‌ప్రావో’ పబ్‌లో వందలాది మంది యువతీ యువకులు సంగీత ప్రపంచంలో తేలిపోతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వేదికపై మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో అకస్మాత్తుగా స్టేజ్ సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుండి దట్టమైన పొగ రావడాన్ని అక్కడి కళాకారులు గమనించారు. ఆ మరుక్షణమే విద్యుత్ సరఫరా నిలిచిపోయి పబ్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఆ వెంటనే పెద్ద పేలుడు శబ్దం రావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు పైకప్పుకు అంటుకుని పబ్ అంతటా వ్యాపించాయి. అక్కడ ఉన్న సుమారు 300 మందికి పైగా జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చీకట్లోనే ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగు తీశారు.

ఈ ఘోర ప్రమాదంలో కనీసం 27 మంది అక్కడికక్కడే సజీవ దహనమవగా, మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు థాయిలాండ్ అధికారులు ప్రకటించారు. ఈ విషాదంలో మంటల కంటే దట్టమైన కార్బన్ మోనాక్సైడ్ పొగ వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు వ్యాపించిన వెంటనే పబ్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక చాలా మంది స్పృహ కోల్పోయారు. ప్రాణాలు కాపాడుకోవాలనే కంగారులో ఎటు వెళ్లాలో తెలియక, వెనుక వైపు ఉన్న టాయిలెట్ల వైపు పరుగులు తీసిన వారంతా అక్కడే ఊపిరాడక ప్రాణాలు విడిచారు. ఆ టాయిలెట్ల నుండి బయటకు వెళ్లేందుకు ఎలాంటి దారి లేకపోవడంతో అది వారికి మృత్యుకుహరంగా మారింది.

ప్రమాద సమాచారం అందిన 5 నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే పబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. లోపల చెల్లాచెదురుగా పడి ఉన్న కుర్చీలు, టేబుళ్లు రెస్క్యూ సిబ్బందికి పెద్ద ఆటంకంగా మారాయి. ఆక్సిజన్ మాస్కులు ధరించిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రమైన వేడిని తట్టుకుంటూ లోపలికి వెళ్లి స్ట్రెచర్లపై బాధితులను బయటకు తీసుకువచ్చారు. పబ్ అధికారికంగా 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారాలు) ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, ప్రమాద సమయంలో ఆ దారులు మూసివేసి ఉన్నాయా లేదా ఏవైనా వస్తువుల వల్ల బ్లాక్ అయ్యాయా అనే కోణంలో బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపుంట్ దర్యాప్తుకు ఆదేశించారు. థాయిలాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ స్వయంగా ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దారుణ ఘటన థాయిలాండ్‌లో 2009 నాటి శాంతికా క్లబ్ ప్రమాదాన్ని (67 మంది మృతి), 2022 నాటి మౌంటైన్ బి క్లబ్ ప్రమాదాన్ని (25 మంది మృతి) గుర్తుచేస్తూ నైట్‌క్లబ్‌ల భద్రతా ప్రమాణాలపై మళ్లీ పెను ప్రశ్నలను లేవనెత్తింది.

thailand nightclub fire accident news,bangkok pub fire kills twenty seven.
 

By
en-us Political News

  
గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు ఈ నెల 10న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం ఆయన కుడి భుజానికి సర్జరీ చేసింది.
259 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆరంభంలో తడబడింది. రోకో (రోహిత్, కోహ్లీ) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే స్కిప్పర్ శుభమన్ గిల్ కెప్టున్స ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా గిల్ కు మంచి సహకారాన్ని అందించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ రనౌట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.
అమెరికా దాడులకు దీటుగా.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కువైట్ లోని అలీ అల్ సలేం సైనిక విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణి, 5 క్రూయిజ్ క్షిపణులు, 33 అత్యాధునిక డ్రోన్లతో దాడికి పాల్పడింది.
మంటలు వేగంగా వ్యాపించి  చూస్తుండగానే ప్లాస్టిక్ మొత్తం కాలి బూడిదైంది.  నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో  ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఆధునీకరణ పనుల కోసం 12.56 కోట్ల నిధులను వెచ్చించింది. ఎన్ఎస్జీ 4 కేటగిరీకి చెందిన ఈ రైల్వే స్టేషన్, రాజధాని అమరావతి ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా కేంద్రంగా సేవలందించనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ స్టేషన్ రూపురేకలను పూర్తిగా మార్చేసింది.
భారతదేశ విద్యావ్యవస్థలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది.
పద్మనాభం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం..!
సోషల్ మీడియా ప్రపంచంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీగా మారిన నేతర్‌హాట్ బడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన శకం ముగిసింది.
టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.