Publish Date:Feb 25, 2026
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ ‘సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్’ తెరపైకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి దిగిన ఇద్దరు ప్రయాణికులు తమ లగేజ్‌తో కూల్‌గా బయటకు జారిపోవాలనుకున్నారు. కానీ కస్టమ్స్ అధికారుల స్కానర్ కళ్లకు మాత్రం వారి ప్లాన్ ‘క్లియర్ పిక్చర్’గా కనిపించింది. బ్యాంకాక్ నుండి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు చాలా తెలివిగా వారి లగేజ్ బ్యాగ్ కింద భాగాన్ని ప్రత్యేకంగా మార్చి గంజాయిని దాచిపెట్టి హుందాగా నడుచుకుంటూ వచ్చారు.
కానీ చివరకు ఆ తెలివితేటలు స్కానింగ్ మెషీన్ ముందు పని చేయలేదు. స్కానింగ్ మిషన్‌లో అసలు విషయం బయట పడడంతో అధికారులు వారి బ్యాగులను తనిఖీలు చేయగా ఒక్కో బ్యాగ్ నుంచి గుట్టలు గుట్టలుగా విదేశీ గంజాయి బయటపడింది. మొత్తం.రూ.18 కోట్లు రూపాయలు విలువ చేసే 18 కిలోల మత్తు పదార్థాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు “టూర్ ముగిసింది… ఇప్పుడు జైలు ట్రిప్ స్టార్ట్” అన్నట్టుగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎన్డీయే యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉందా? ఈ గంజాయి ఎవరెవరికి సరఫరా చేయనున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bangalore-airport-36-214667.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.