బండ్లగూడ చిన్నారి మృతి కేసులో ఒకరు అరెస్టు
Publish Date:Feb 22, 2026
Advertisement
బండ్లగూడలోని క్రియాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఘటనపై వైద్యశాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారి లక్ష్మి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆసుపత్రిలో విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు వైద్యశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కాలం చెల్లిన టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. జనవరి నెలలోనే గడువు ముగిసిన టాబ్లెట్లను చిన్నారికి ఇవ్వడం వల్లే రియాక్షన్ వచ్చినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారికి ఇచ్చిన మందుల వివరాలు, చికిత్స విధానం, డోసుల పరిమాణం వంటి అంశాలను అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. రియాక్షన్ రావడంతో పరిస్థితిని నియంత్రించేందుకు ఆసుపత్రి సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చినట్లు సమాచారం. శిశువుల బరువు, వయసును ఆధారంగా చేసుకుని మాత్రమే మందుల డోసులు ఇవ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారి లక్ష్మి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆ ఇంజక్షన్‌ను కేవలం వైద్యుడు మాత్రమే 0.1 నుంచి 0.6 మోతాదులో శిశువు వయసుకు అనుగుణంగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. చిన్నారి కేస్‌షీట్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించను న్నారు. ఇక చిన్నారి మృతికి కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రి నిర్వహణలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. బండ్లగూడ కియాన్స్ ఆసుపత్రి యజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి...కియాన్స్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ని అదుపు తీసుకున్నారు.. బాబుకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు .. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బండ్లగూడ ఘటనపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bandlaguda-childrens-hospital-36-214482.html





