తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

Publish Date:Feb 25, 2026

Advertisement

 

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గి, ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులు నిర్వహిస్తూ, ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సు సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది.

రోజుకు 60 వేల మంది భక్తులు సురక్షితంగా ప్రయాణం

బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60 వేల మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు.

తగ్గిన ప్రైవేట్ ట్యాక్సీల ప్రయాణం - పెరిగిన ప్రజా రవాణా వినియోగం

గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్ లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. 

ఇందుకుగాను హైదరాబాద్ కు చెందిన బి.ఎస్.టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ఎంతో ఉపయోగరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ తోడ్పాటు

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీని తగ్గించి కాలుష్య నియంత్రణ దిశగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది.

భక్తుల కోసం రాత్రుల్లో అదనంగా 20 ట్రిప్పులు

ప్రస్తుతం రాత్రి 9 నుండి ఉదయం 5 ఐదు గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచనున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 

By
en-us Political News

  
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది.
హైద‌రాబాద్ రాయ‌దుర్గం పీఎస్ ప‌రిధిలో చిత్ర‌పురి కాల‌నీలో ఒక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరపైకి వచ్చింది.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో చ‌దువుకుంటున్నా, అమ్మ‌లాంటి తెలుగుభాష‌ను మ‌రువొద్ద‌ని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు.
తాజాగా మరో సారి తెలంగాణలోని నాంపల్లి కోర్టు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు లేఖలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు ఆయా కోర్టుల ఆవరణల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులను ఖాళీ చేయించి ఈ తనిఖీలు నిర్వహించారు.
బీహార్‌లో ప్రేమ విఫలం కావడంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన సంచలనం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.