తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు.
అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. సరే అదంతా అయిపోయింది. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీకి వీడ్కోలు పలికిన తరువాత బండి తనను తాను మరచిపోయి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కోన్ కిస్కా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ విజయవంతమైన ఆనందం ఆయనలో పట్టలేనంతగా ఉండొచ్చు తప్పు లేదు. ఆ ఆనందాన్ని పార్టీ సహచరులతో పంచుకోవచ్చు. మరింత ఉత్సాహంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చు. కానీ బండి ఆ ఆప్షన్లు ఎంచుకోలేదు. ముఖ్యమంత్రిపై పరుష వ్యాఖ్యలతో రెచ్చి పోయారు.
సీఎం కేసీఆర్ ఎవరు కోన్ కిస్కా.. ప్రధాని మోడీ ఆయనకు సమాధానం చెప్పడమేమిటి, మోడీ చెప్పాల్సిందేదో తెలంగాణ ప్రజానీకానికే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగం తరువాత కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఇంత కాలం ఊదరగొట్టిన కేసీఆరే తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఇంత కాలం కేంద్రం నిధులతో షోకు చేసిన కేసీఆర్ బండారం మోడీ ప్రసంగంతో బట్టబయలైందని విమర్శించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎంత ఘాటుగానైనా ఉండొచ్చు కానీ బాధ్యతాయుతమైన నేత ఎవరూ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఇష్టారీతిన చేసే వ్యాఖ్యల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కోన్ కిస్కా అని బండి చులకన చేయడం పట్ల బీజేపీ శ్రేణుల్లోనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-sensational-comments-on-kcr-39-139027.html
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.
తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది