బండి సాయి భగీరథ్ మళ్లీ చర్లపల్లి జైలుకు

Publish Date:Jun 26, 2026

Advertisement

పోక్సో కేసులో అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి సాయి భగీ రథ్‌కు పరీక్షలు రాసేందుకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయనను శుక్రవారం (జూన్ 24) తిరిగి జైలుకు తరలించారు. మహీంద్రా యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదివిన భగీరథ్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో..  వాటికి సంబంధించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను యూనివర్సిటీ ఇటీవల నిర్వహించింది. గత మే నెలలో జరిగిన సాధారణ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ఆయన పోక్సో కేసులో జైలులో ఉండటం తో పరీక్షలు రాయలేకపో యాడు. దీంతో విద్యా సంవ త్సరం నష్టపోకుండా ఉండేం దుకు యూనివర్సిటీ ప్రత్యే కంగా మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను ఏర్పాటు చేసింది.

ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు భగీరథ్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్  పొందారు.  దీంతో ఈ నెల 20న చర్లపల్లి జైలు నుంచి తాత్కాలికంగా విడుదలైన ఆయన, యూనివర్సిటీ నిర్వహించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో కోర్టు విధించిన మధ్యంతర బెయిల్ గడువు కూడా ముగిసింది. దీంతో భగీరథ్‌ను  పోలీసులు మేడ్చల్, మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను తిరిగి చర్లపల్లి కేంద్ర కారా గారానికి తరలించారు.  

By
en-us Political News

  
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.