కొడుకును విచారణకు పంపండి...బండి సంజయ్‌కు సీఎం సూచన

Publish Date:May 15, 2026

Advertisement

 

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ హుందాగా వ్యవహరించే బాధ్యత కలిగి ఉన్నారని, తన కుమారుడిని స్వచ్ఛందంగా విచారణకు అప్పగించాలని సీఎం కోరారు.మే 8న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. అనంతరం ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. మే 11న మైనర్ బాలిక నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేసిన తర్వాతే పోక్సో కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.


“మాకు ఎవరైనా ఒక్కటే. నేరం చేసిన వారిని శిక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తల్లి ఫిర్యాదుకంటే మైనర్ బాలిక స్టేట్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశాం” అని సీఎం పేర్కొన్నారు. ఈ కేసును ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేసిన సీఎం, “బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదైతే బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలా?” అంటూ ప్రతిపక్ష విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం, పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 “గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన వారు, ఇప్పుడు అదే గడీల కోసం పని చేస్తున్నారు” అని విమర్శించారు. బాలికకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర ఆధారాలు సేకరించామని, తగిన ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఎం తెలిపారు. “గతంలో కేసీఆర్ తనపై కేసులు పెట్టినట్లుగా మేము హడావుడిగా వ్యవహరించడం లేదు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం” అని అన్నారు. కేంద్రమంత్రి అయినా, మరెవరైనా అయినా బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం” ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
ఈ నెల 20వ తేదీన దేశంలోని అన్ని మెడికల్ షాపులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది.
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.