Publish Date:Jun 17, 2025
బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ప్రత్యేక ఆహ్వానం పలకడం మాత్రమే కాదు వారి వారికి ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు తెలంగాణ నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ దిశగా ఆయన ఇప్పటికే కేంద్రానికి ఎన్నో లేఖలు కూడా రాశారు. ఏపీ ప్రభుత్వ బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వరాదంటూ కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ఏపీ సైతం ఒక ప్రెజంటేషన్ ఇచ్చింది. అసలు బనకచర్లకూ తెలంగాణకు సంబంధమేంటి? మేమేమైనా మీ ప్రాజెక్టులు ఆపామా? అయినా ఎగువ రాష్ట్రం కట్టే ప్రాజెక్టులకే అభ్యంతరాలు తెలపాలి. దిగువన ఉన్న రాష్ట్రం విషయంలో నష్టపోయేవారెవరని? ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయ్. మరి ఆ నీటినే మేం వాడుకోదలుచుకున్నాం. రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరందించే యత్నం చేస్తున్నామంటోంది ఏపీ. దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైన అనంతపురానికి.. నీరందించడం తప్పెలా అవుతుందన్నది- ఏపీ నీటి మంత్రి నిమ్మల సంధిస్తోన్న ప్రశ్నాస్త్రం.
ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టును 80 వేల కోట్ల రూపాయలతో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది ఏపీ. పోలవరం లింక్ ప్రాజెక్ట్ అయిన దీనికోసం ఇప్పటికే కేంద్రానికి అనుమతుల కోసం అప్లై చేసుకుంది. గతంలో ఇదే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సైతం సమ్మతించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానంటూ ఆయన అన్న మాటలను తన ప్రెజంటేషన్లో పొందు పరిచారు నిమ్మల. అంతే కాదు కేసీఆర్ ఉదారత గురించి జగన్ చేసిన కామెంట్లను కూడా తన ప్రెజంటేషన్ ద్వారా ప్రస్తావించారు మంత్రి. రాయలసీమ బిడ్డగా చెప్పుకు తిరిగే జగన్.. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నది మంత్రి సూటిగా వేస్తోన్న ప్రశ్న.
ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు విషయంలో అంటున్న మాటేంటో చూస్తే.. కృష్ణాజలాల విషయంలో పోతిరెడ్డిపాడు ఎలాంటిదో.. గోదావరి జలాల విషయంలో బనకచర్ల అలాంటిదని అంటారు మాజీ నీటి పారుదల మంత్రి హరీష్ రావు. ఇక కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. అభ్యంతరాలుంటే కేంద్రానికి చెప్పుకోవాలి. మధ్యలో మా ప్రమేయం ఏముంటుందని అంటారాయన.
ఈ విషయంలో నిపుణులు అంటోన్న మాటలేంటని చూస్తే.. ఇప్పటికే గోదావరి పై తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులకు చెందిన డీపీఆర్లు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి ప్రాజెక్టులకు అసలు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇది నాడు కేఎల్ రావు చెప్పిన నదుల అనుసంధానానికి చెందిన ప్రాజెక్ట్. ప్రధాని మోడీ సైతం నదుల అనుసంధానం చేయాలంటారు. ఇక 1980 నాటి ట్రిబ్యునల్ తీర్పులుగానీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 గానీ ఉల్లంఘించడం లేదు. ఎందుకంటే ఆ తీర్పులన్నీ నికర జలాలపైన వచ్చినవి. తామేమీ వాటి జోలికి పోవడం లేదే.. వరద నీరు వృధాగా పోకుండా సద్వినియోగం చేస్తున్నాం. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీటి కారణంగా కోటి మందికి పైగా ముంపునకు గురయ్యారు. దీన్ని నివారించడానికే ఇదంతా అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇపుడీ బనకచర్ల గొడవ ఎటు పోయేట్టు? రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఎప్పుడు ముగిసేను? తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banakacharla-39-200175.html
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.