Publish Date:May 24, 2022
పెళ్లి కోసం ఆ యువకుడు వంద అబద్ధాలేం చెప్పలేదు.. ఒకే ఒక విషయం దాచాడంతే.. సరిగ్గా పెళ్లి పీటల మీద ఆ దాచిన రహస్యం కాస్తా బట్టబయలైంది. అంతే పెళ్లి కూతురు పెళ్లే వద్దంటూ పీటల మీదే పెళ్లిని ఆపేసింది. ఇంతకీ జరిగిందేమిటంటే.. బట్టతల ఉందని సిగ్గుపడుతూ ఓ యువకుడు విగ్గుతో మేనేజ్ చేస్తున్నాడు. ఆ యువకుడికి పెళ్లి కుదిరింది. వధూవరులిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.
తీరా ముహూర్తం సమీపించేసరికి పెళ్లి పీటల మీదే ఆ యువకుడి విగ్గు ఊడిపోయి బట్టతల బండారం బైట పడింది. అంతే పెళ్లి కూతురు అగ్గిమీద గుగ్గిలమైపోయింది. బట్టతల కుర్రోడితో తనకు పెళ్లి వద్దంటే వద్దంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగింది. ఇంతకీ వదువుకు అంత కోప మెందుకొచ్చిందంటే..బట్టతల విషయం దాచి పెట్టినందుకు. ఇంత చిన్న విషయం కూడా దాచిపెట్టే వరుడు రేపు పెళ్లయిన తరువాత ఇంకా ఏంఏం దాచిపెడతాడో అన్న అనుమానం ఆమెను పెళ్లే వద్దనుకునేలా చేసింది.
చిన్న విషయమే కదా సర్దుకు పొమ్మంటూ పెళ్లి పెద్దలు ఎంత నచ్చ చెప్పినా పెళ్లి కూతురు ససేమిరా అంది. దీంతో చేసేది లేక పెళ్లి ఆపేశారు. ఇదంతా మీ వల్లే జరిగిందంటూ పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లి కుమారుడి సంబంధీకులపై తిట్ల దండకం కురిపించారు. అంతే కాదు..తమను మోసం చేశారంటూ వరుడి కుటుంబీకులపై పోలీసు కేసు కూడా పెట్టారు. పోలీసులు కూడా ఇరు వర్గాలకూ నచ్చ చెప్పి పెళ్లి యధావిధిగా జరిపించేందుకు వారి వంతు ప్రయత్నం వారు చేశారు.
అయినా పెళ్లికూతురు సమాధాన పడక పోవడంతో మిన్నకుండి పోయారు. కానీ పెళ్లి కూతురి తరఫు వారు మాత్రం తమకు పెళ్లి కోసం ఐదున్నర లక్షల రూపాయలు ఖర్చైందనీ, ఆ మొత్తం ఇచ్చి తీరాలనీ పట్టుబట్టారు. చేసేదేం లేక పోలీసుల సమక్షంలోనే ఆ మొత్తం వధువు తరఫువారికి ఇచ్చేందుకు అంగీకరించి పెళ్లి కొడుకును తీసుకుని వారు వెళ్లి పోయారు. బట్టతల ఉందన్న చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుని దాచి పెట్టినందుకు బాధపడుతూ పెళ్లి కొడుకు బట్టతల నిమురుకుంటూ కుమిలిపోయాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bald-head-stopped-marriage-25-136366.html
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.