బాహుబలి కథ లీకయ్యిందోచ్....!
Publish Date:Nov 14, 2013
Advertisement
"మర్యాద రామన్న" చిత్రం విడుదలకు ముందే దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం కథ చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అదే విధంగా "ఈగ" చిత్రం కథ కూడా ముందే చెప్పి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ "బాహుబలి" చిత్రం కథ లీకయ్యింది. నిజానికి ఈ కథ తెలిసిపోయిన కొందరు వ్యక్తులు దీనిని కామెడీగా షార్ట్ ఫిల్మ్ గా కూడా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏమిటా కథా అని అనుకుంటున్నారా? ప్రభాస్, రానా అన్నదమ్ములు. వీరిద్దరూ కూడా అనుష్కనే ప్రేమిస్తారు. కాకపోతే ఆ అమ్మాయికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న రానా, ప్రభాస్-అనుష్క లను విడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. దీనికి వీరు రాజమార్గాన్ని ఎంచుకుంటారు. కానీ రానా మాత్రం రాజామార్గంతో పాటు, అడ్డదారి ప్రయత్నాలు కూడా చేస్తూ అనుష్కను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. దీనికోసం తన సొంత మనుషులను కూడా చంపడానికి రానా ప్రయత్నిస్తుంటాడు. తర్వాత ప్రభాస్-అనుష్క లకు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత అనుకోకుండా ఇదే సమయంలో వీరికి ఒక పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్యను ప్రభాస్ బాహుబలి లాగా పోరాడుతుంటే... రానా మాత్రం అనుష్కను తన వశం చేసుకోడానికి ఇదే మంచి అవకాశం అనుకొని.. తనని దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తాడు. తర్వాత ఫైనల్ గా ప్రభాస్-రానా లకు భారీ యుద్ధం జరిగి, చివరికి రానాకి బుద్ధి వచ్చేలా చేస్తాడు ప్రభాస్. దాంతో ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకుంటారు. ఈ కథ వినటానికి చాలా కొత్తగా ఏం లేకపోయినా కూడా, దీనిని రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టనున్నాడని తెలిసింది.
http://www.teluguone.com/news/content/bahubali-story-leaked-32-27438.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





