Publish Date:Oct 17, 2019
దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని... నిర్మోహి అఖాడ, రాంలాల్ విరాజ్‌మని, సున్నీ వక్ఫ్ బోర్డుకు సమానంగా పంచుతూ... అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ... దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం విచారణ జరిపింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. 2019 ఆగస్ట్ 6నుంచి అక్టోబర్ 16వరకు మొత్తం 40రోజులపాటు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వు చేసింది.
అయితే, చివరి రోజు సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. హిందువుల నమ్మకం ప్రకారం ఇది రామజన్మభూమిగా కొనసాగుతోందని, అలాగే రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని హిందూ వర్గమైన రాంలాలా విరాజ్‌మని తరపున న్యాయవాదులు వాదించారు. అనంతరం సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించిన లాయర్లు... బాబర్ వచ్చి మసీదును నిర్మించాక... ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవని ధర్మాసనానికి విన్నవించారు. ఈ పిటిషన్లతోపాటు పలు వ్యక్తిగత, హిందూసభ, వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. అయితే, వాదనలు వినిపించేందుకు బుధవారం సాయంత్రం 5గంటల వరకు గడువిచ్చిన సీజేఐ.... గంట ముందే విచారణ పూర్తయినట్లు ప్రకటించారు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మూడ్రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు.
అయితే, వాదనల సందర్భంగా సుప్రీంలో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణలో భాగంగా సీజేఐతో ఇటు హిందూ, అటు ముస్లిం తరపు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. హిందూ మహాసభ తరపు లాయర్... ధర్మాసనం ముందుంచిన... అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని ముస్లింల తరపు లాయర్ చించేయడంతో.... రగడ జరిగింది. దాంతో సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాగైతే విచారణను మధ‌్యలోనే నిలిపివేస్తానని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన కేసుల్లో ఇది రెండోది. 1972లో ప్రాథమిక హక్కులపై దాఖలైన పిటిషన్‌పై 68రోజులపాటు విచారణ జరగగా, 13మంది జడ్జిల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆ తర్వాత ఆధార్ కేసుపై 38 రోజులపాటు విచారణ జరిగింది. అయితే, అయోధ‌్య కేసుపై 40రోజులపాటు విచారణ జరగడంతో... సుప్రీం చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా రికార్డులకెక్కింది. మొత్తానికి వివాదాస్పద అయోధ్య భూమిపై వాదనలు ముగియడంతో... తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే, నెలరోజుల్లోపే తీర్పును వెలువరిస్తానని సీజేఐ ప్రకటించడం... అలాగే రంజన్ గొగోయ్... నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండటంతో... ఆలోపే... తీర్పు వెలువరించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ayodhya-hearing-concludes-after-40-days-39-90169.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.