ఖ‌మేనీ ఖేల్ ఖ‌తం... ఏక్ సైలెంట్ మొసాద్ ఆప‌రేష‌న్

Publish Date:Mar 4, 2026

Advertisement

 

అయ‌తుల్లా అలీ ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డానికి మొసాద్ త‌న ఆప‌రేష‌న్ ని 2020లో మొద‌లు పెట్టి.. 2026లో ముగించింది. ఇది ఎంతో ఓపిగ్గా సాగిన ఒకానొక డీపెస్ట్ క‌మ్ లాంగెస్ట్ క‌మ్ డెడ్లీ ఆప‌రేష‌న్... అదెలా సాగిందో చూస్తే..మొద‌ట డాల‌ర్లు ఇచ్చి ఖ‌మేనీ వ్య‌తిరేకులెవ‌రో వారిని మ‌చ్చిక చేసుకుంది మొసాద్. వారు ఏ మొబైల్ యాప్స్ ఎక్కువ‌గా వాడుతున్నారో తెలుసుకుంది. 

ఇరాన్ లో ప‌ర్షియ‌న్ భాష‌లో రోజూ న‌మాజు చేసే స‌మ‌యాలు, రంజాన్ లాంటి ప‌ర్వ దినాల్లో ప్ర‌త్యేక ఖురాన్ ప్ర‌వ‌చ‌నాల‌ను మెసేజీల రూపంలో పంపే యాప్‌లు  చాలానే ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ లో. అలాంటి యాప్ ల‌లో బ‌డే స‌బా  క్యాలండ‌ర్ అనే పేరుతో ఉన్న ఒక యాప్ సుమారు యాభై ల‌క్ష‌ల మంది ఇరాన్ ప్ర‌జ‌లు వాడుతున్న‌ట్టు తెలుసుకుంది మొసాద్. ఈ యాప్‌ని  హ్యాక్ చేసింది. ఇది ఎవ‌రూ  క‌నీసం గుర్తించ‌లేక పోయారు.

బ‌డే స‌బ అనే ఈ క్యాలెండ‌ర్ యాప్ షియా ముస్లిమ్‌ల  కోసం ప‌ర్షియ‌న్ భాష‌లో రూపొందించారు. ఇది ఇస్లామిక్ క్యాలెండ‌ర్. రోజుకు ఐదు సార్లు న‌మాజ్ చేసే ఫజ్ర్, ఇష  స‌మ‌యాల‌ను గుర్తు చేస్తూ పుష్ నోటిఫికేష‌న్ల‌ను పంపుతుంది. చిన్న అలారం సౌండ్‌తో న‌మాజు చేయండి అని సూచిస్తుంటుంది.అంతే కాదు మ‌త పెద్ద‌లు మ‌ర‌ణించిన రోజు, ఇత‌ర మ‌త‌ప‌ర‌మైన పండుగ‌ల‌ను సైతం గుర్తు చేస్తూ నోటిఫికేష‌న్లు పంపుతుంది బ‌డే స‌బ యాప్.

ఇదిలా ఉంటే, ఇరాన్ లోని ట్రాఫిక్  నెట్ వ‌ర్క్ గ‌త కొంత కాలం నుంచి.. మొసాద్ ఆధీనంలో ఉంది. అవ‌స‌ర‌మైన‌పుడు ట్రాఫిక్ కెమ‌రా నెట్ వ‌ర్క్ లో ఎక్క‌డ త‌న‌కి లైవ్ వీడియో అవ‌స‌ర‌మో అక్క‌డి లైవ్ ఫుటేజీని వాడుకుంటూ వ‌స్తోంది మొసాద్. స‌మ‌స్య ఏంటంటే ఇదే క్యాలెండ‌ర్ గూగుల్ ప్లే స్టోర్ లో కాకుండా ఏపీకే ఫైల్స్ రూపంలో థ‌ర్డ్ పార్టీ  ప్లాట్ ఫామ్స్ ద్వారా  కూడా  ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఎవ‌రైనా ఈ థ‌ర్డ్ పార్టీ ప్లాట్ ఫామ్స్ ద్వారా.. ఫైల్స్ డౌన్ లోడ్  చేసుకుని  వాడుతుంటే దాన్ని గుర్తించి వారి మొబైల్ నుంచి నెట్ వ‌ర్క్ లోకి దూరి పోయి హ్యాక్ చేసేవారు మొసాద్ ఏజెంట్లు.

1998 నుంచ ఇజ్రాయ‌ల్ హ్యాక‌ర్స్ ఎంతో చురుగ్గా  ఉంటూ వ‌స్తున్నారు. కాబ‌ట్టి  మొసాద్ కి హ్యాకింగ్ అన్న‌ది  కొట్టిన  పిండి. వైర్డ్ మిడిల్ ఈస్ట్ వారి క‌థ‌నం  ప్ర‌కారం..  ఫిబ్ర‌వ‌రి 28 శ‌నివారం ఉద‌యం.. ట్రాఫిక్ సిగ్న‌ల్స్  ద‌గ్గ‌ర  ఉండే సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్న లైవ్ దృశ్యాల‌ను చూస్తున్న మొసాద్ ఏజెంట్స్ కి సుప్రీం  లీడ‌ర్ అయ‌తుల్ల ఖ‌మేనీని క‌ల‌వ‌డానికి  వెళ్తున్న ఆయ‌న  న‌మ్మిన బంట్లు గ‌ల‌ కార్లు క‌నిపించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొద‌ల‌య్యే స‌మ‌యం కాబ‌ట్టి.. వారు ఖ‌మేనీతో అత్య‌వ‌స‌ర  స‌మావేశం కోస‌మే వెళ్తున్నారు.

అప్ప‌టికే ఇరాన్ లో ఇంట‌ర్నెట్ స్పీడు త‌గ్గిపోయి ఉండ‌టం వ‌ల్ల.. టెక్స్ట్ మెసేజీలు మాత్ర‌మే మొబైల్ ఫోన్లకు వ‌స్తున్నాయి. త‌ప్పితే వీడియో, ఫోటోలు రావ‌డం నిలిచిపోయాయి. IRGC సైబర్ సెక్యూరిటీ విభాగం, ఇంట‌ర్ నెట్ ఎందుకు స్లో అయిందో పరిశీలన చేయగా.. అంతా బాగానే ఉంది కానీ, ఎందుకు స్లో అయిందో గుర్తించలేకపోయారు.

శనివారం ఉదయం 10:08 నిముషాలకి ఇరాన్ లో బడే సబ యా వాడుతున్న అందరికీ ఒక పుష్ నోటిఫికేషన్ వచ్చింది  హెల్ప్ అరైవ్డ్ అని. ఈ హెల్ప్ అరైవ్డ్ అనే నోటిఫికేష‌న్ వ‌చ్చే స‌మ‌యానికి ఖ‌మేనీ నివాసం మీద ఎయిర్ టు స‌ర్పేస్ మిస్సైల్ దాడి జ‌రిగి భ‌వ‌నం పూర్తిగా  కుప్ప కూలిపోయింది.  ఖ‌మేని మ‌ర‌ణించిన‌ట్టు నిర్ధారించిన త‌ర్వాత మ‌రో పుష్ నోటిఫికేష‌న్ 10. 14 నిమిషాల‌కు వ‌చ్చింది.

అదెలాంటిదంటే, ఇరాన్ ప్రజలని క్రూరంగా హింసించి హత్య చేసిన ప్రభుత్వం మీద పగ తీర్చుకునే సమయం వచ్చేసింది. ఇప్పటికే మీ దగ్గర ఆయుధాలు ఏవన్నా ఉంటే వాటిని వదిలేసి వచ్చి.. IRGC మీద పోరాడడానికి మాతో వస్తే మీకు క్షమాభిక్ష పెడతాము.. అన్న‌ది ఈ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ వచ్చిన సమయానికి అమెరికన్, ఇజ్రాయేల్ ఫైటర్ జెట్స్ టెహ్రాన్ నగరం బయట గగనతలంలో ఎగురుతున్నాయి. ఖ‌మేనీ తన భవనంలోనే ఉన్నార‌ని నిర్ధారించుకున్న‌ మరు క్షణమే మిసైల్స్ ప్రయోగించడం, అదే సమయంలో మొబైల్ ఫోన్ల కి మెసేజ్లు పంపింంచడం ఒకే సారి జరిగిపోయాయి. 

IRGC లో మోస్సాద్ కి ఎజెంట్స్ ఉన్నారన్నది చాలా చాలా పాత విషయం. ఖ‌మేనీ తన నివాసంలో ముఖ్యలతో ఉన్నాడని ఖమేనీ నివాసంలోని వాళ్లలో ఎవరో సమాచారం ఇచ్చారు. సదరు సమాచారం ఇచ్చిన వ్యక్తి మీసైల్ దాడిలో చనిపోయి ఉంటాడు. ఇందుకే ఆశ్చ‌ర్య పోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఒక్క ఖ‌మేనీని చంప‌డం కోసం మొసాద్ చాలానే  ప్లాన్ సెట్ చేసింది. ఎన్నో ప్రాణాల‌ను ఖ‌మేనీ ప్రాణాల‌కు బ‌లి ఇవ్వాల్సి  వ‌చ్చింది. 

ఈ ఖ‌మేనీ ఖ‌తం ఎపిసోడ్ క‌న్నా ముందు ఇరాన్ లో ఎన్నో ప్రాణాలు పోవ‌డానికి కార‌ణం మొసాద్. మొసాద్ త‌న‌దైన హ్యాకింగ్ తెలివి  తేట‌ల‌తో బ‌డే స‌బ వంటి యాప్ ల ద్వారా కొన్ని రెచ్చ‌గొట్టుడు మెసేజీల‌ను పాస్ చేసేది. అది కూడా  ఖ‌మేనీ వ్య‌తిరేఖుల‌కు. వారు ఈ మెసేజీల‌కు రెచ్చి పోయి రోడ్ల మీద‌కు వ‌చ్చేవారు. వారిని ఖ‌మేనీ ప్ర‌భుత్వం హ‌త‌మార్చేసేది. వీరి  సంఖ్య కొన్ని వేల‌కు చేరింది. దీంతో ఖ‌మేనీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ‌మేనీ ప‌ట్ల ఒక ర‌క‌మైన వ్య‌తిరేఖ భావ‌న వ‌చ్చింది. ఇదే అద‌నుగా భావించిన మొసాద్ త‌న టార్గెట్ ఫిక్స్ చేసింది. ఖ‌మేనీ ఖేల్ ఖ‌తం చేసింది. ద‌టీజ్ మొసాద్ కా మెసేజ్ ప‌వ‌ర్!

సిట్యువేష‌న్ ని కంట్రోల్లోకి తీసుకోవ‌డం మాత్ర‌మే కాదు త‌మ‌కు కావ‌ల్సిన సిట్యువేష‌న్ క్రియేట్ చేయ‌డంలో కూడా ఆరితేరిపోయింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్. అందుకే  తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న కూడా చేసింది.. ఇజ్రాయెల్. ప్ర‌స్తుతం ఇరాన్ సుప్రీం లీడ‌ర్ గా ఖ‌మేనీ రెండో కుమారుడు మ‌జ్త‌బాను ఎంపిక చేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఎవ‌రైతే వారు త‌మ టార్గెట్ అయిపోతార‌ని అన్నారు ఇరాన్ ర‌క్ష‌ణ  మంత్రి..కాట్జ్. ఇది  మ‌న క్లియ‌ర్ టార్గెట్ అంటూ ఇప్ప‌టికే ఆయ‌న  త‌మ భ‌ద్ర‌తా ద‌ళ‌మైన ఐడీఎఫ్ కి ఆర్డ‌ర్లు పాస్ చేసేశారు. అంటే కొత్త సుప్రీం లీడ‌ర్ డెత్ స‌ర్టిఫికేట్ కూడా రెడీ  అయిపోయింద‌న్న‌మాట‌. అదీ మొసాద్ అంటే.


 

By
en-us Political News

  
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.