చనిపోతున్నాననుకుని సిడ్నీ హీరో ఆఖరి సందేశం

Publish Date:Dec 15, 2025

Advertisement

 

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో తండ్రీకొడుకులైన ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ ఇప్పుడు రియల్ హీరోగా నిలిచారు. పండ్ల దుకాణం నడుపుకునే సాధారణ వ్యక్తి అయిన అహ్మద్‌.. తుపాకీ కాల్పుల మధ్య ఉగ్రవాదిని ధైర్యంగా అడ్డుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ పోరాటం మధ్యలో ఆయన తన బంధువుతో.. "నేను చనిపోతున్నా. నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని పంపిన చివరి సందేశం యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. 

ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు. ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. తండ్రీకొడుకులైన ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న అహ్మద్‌ అల్‌ అహ్మద్‌‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రదాడి జరుగుతున్న సమయంలోనే అతడు.. ఈ పోరాటంలో నేను మరణిస్తాననిపిస్తోందని, ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలియజేయాలని పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. ఆయన చేసిన ఈ చివరి మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి.

సిరియా దేశానికి చెందిన అహ్మద్‌ అల్‌ అహ్మద్‌.. నిత్యం అంతర్యుద్ధాలతో నలిగిపోయే తన దేశాన్ని వీడి మెరుగైన భవిష్యత్తు కోసం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్‌ షైర్‌లో భార్యాపిల్లలతో (ఇద్దరు చిన్న పిల్లలు) కొత్త జీవితాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఒక పండ్ల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అహ్మద్.. తన సాధారణ జీవితంలో ఊహించని హీరోగా మారారు. ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన ఆదివారం ఉదయంబోండి బీచ్‌లో తన బంధువు జోజీ అల్కాంజ్‌తో కలిసి అహ్మద్‌ కాఫీ షాప్‌లో ఉన్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వారు భయపడిపోయారు. అయితే వెంటనే తేరుకున్న అహ్మద్‌.. ఉగ్రవాదులను చూసి వారిని ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు.

అక్కడ ఏం జరగబోతోందో తెలిసిన ఆయన.. తన బంధువు అల్కాంజ్‌తో ఇలా అన్నారు: "నేను చనిపోబోతున్నా. నా కుటుంబాన్ని చూసుకో. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని తన చివరి సందేశాన్ని ఇచ్చారు. ఈ హృదయ విదారక విషయాన్ని అల్కాంజ్ మీడియాకు వెల్లడించారు.ఈ ఘటన సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్‌ అడ్డుకున్నారు. వెనుక నుంచి వెళ్లి ధైర్యంగా ఆ దుండగుడి చేతిలోని తుపాకీని లాక్కున్నారు. 

దీంతో ఆ ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఉగ్రవాదిని అడ్డుకునే ప్రయత్నంలో అహ్మద్‌ గాయపడగా.. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు. అహ్మద్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బోండి బీచ్‌ ఉత్సవంలో జరిగిన ఈ కాల్పుల దుర్ఘటనలో 16 మంది మరణించారు. కాల్పులు జరిపినవారు పాకిస్థాన్ నుంచి వచ్చిన తండ్రీకొడుకులని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ, లేని పక్షంలో సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం సహకరించదని బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.