దేవాలయంలో చోరీ యత్నం.. పట్టుబడి చావుదెబ్బలు తిన్న దొంగ
Publish Date:Dec 17, 2025
Advertisement
ఓ దొంగ పక్కా ప్రణాళికతో దేవాలయంలో దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ అనూహ్యంగా స్థానికుల చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్నాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని పోచమ్మ దేవాలయంలో దొంగతనానికి ఓ యువకుడు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఓ యువకుడు రాత్రి సమయం లో అత్తాపూర్ పరిధిలోని పోచమ్మ దేవాలయానికి వెళ్ళి, అమ్మవారి మెడలో ఉన్న బంగారు చైన్‌తో పాటు వెండి వస్తు వులు దొంగిలించి పారిపో తుండగా... అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి దొంగను చూశాడు. దొంగను గమనించిన పూజారి వెంటనే గట్టి గట్టిగా కేకలు వేయడంతో అప్రమ త్తమైన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని పారిపో తున్న దొంగని పట్టుకున్నారు. అనంతరం అతడిని ఆలయ ప్రాంగణం లోని స్తంభానికి తాళ్లతో కట్టేశారు. ఈ ఘటనలో కొందరు స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఆ దొంగ డొంకతిరుగుడు సమాధా నాలు చెప్పాడు. దీంతో కొందరు ఆగ్రహంతో దుండగుడిని చావగొట్టారు. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసా గుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన దొంగను ఆస్పత్రికి తరలించారు.
http://www.teluguone.com/news/content/attempted-theft-at-the-temple-36-211143.html





