అదృష్టం తెచ్చే పాముల పేరుతో మోసాలు వ్యక్తి అరెస్ట్

Publish Date:May 18, 2026

Advertisement

 

వరంగల్ బహిరంగ మార్కెట్‌లో అరుదైన రెండు తలల పాములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. “ఈ పాములను ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుంది… ధనవంతులు వీటిని పెంచుకుంటారు” అంటూ మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే… వరంగల్ జిల్లాలోని గ్రే మార్కెట్‌లో రెండు తలల పాముల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్  అధికారులకు అందింది. దీంతో అధికారులు ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వేషం మార్చుకున్న ఓ డీఆర్‌ఐ అధికారి కస్టమర్‌గా నిందితుడిని సంప్రదించి, తన వద్ద ఉన్న పాములను చూపించాలని కోరాడు.నిందితుడు బ్యాగ్ తెరిచి చూపించగానే అందులో ఇండియన్ రెడ్ సాండ్ బోవా జాతికి చెందిన రెండు అరుదైన పాములు కనిపించాయి. వెంటనే అక్కడే సిద్ధంగా ఉన్న అధికారులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని పాములను స్వాధీనం చేసుకున్నారు.

ఈ జాతి పాములను ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వస్తుందనే ప్రచారం, క్షుద్ర పూజలు, గుప్తనిధుల అన్వేషణ, అలాగే కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీ పేరుతో వీటికి భారీ డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మించేలా చేసి అక్రమ వ్యాపారం నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో ఒక్క పాము ధర రూ.2 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు అటవీ ప్రాంతాల నుంచి ఈ అరుదైన పాములను సేకరించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న పాములను, నిందితుడిని వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు. ఈ కేసు వెనుక ఉన్న పెద్ద రాకెట్‌పై అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.