తికాయత్ పై దాడి కేసీఆర్ చలవేనా?
Publish Date:May 30, 2022
Advertisement
ఒకప్పుడు కేసీఆర్ పట్టిందల్లా బంగారమే .. కానీ ఇప్పడు ... డామిట్ కథ అడ్డం తిరిగింది. అవును, కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారమో, వాస్తవమో కానీ, కేసీఆర్’తో చేయి కలిపేందుకు, ఇతర పార్టీల నాయకులు,ఇతర ప్రముఖులు జంకు తున్నారా?ఆయనతో చేయి కలిపితే కష్టాలు తప్పవని భయపడుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఒకప్పుడు ఆయన ఎక్కడికెళ్ళినా అంతో ఇంతో గౌరవం దక్కేది... ఇప్పడు ఆయన ఎక్కడి కెళితే అక్కడ తలుపులు మూసుకు పోతున్నాయి. అంతే కాదు పోనీ పాపమని, ఆయనతో చేతులు కలిపిన నాయకులు కష్టాల పాలవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబద్ వచ్చి కేసీఅర్ ను, తెరాస ప్రభుత్వాన్ని తిట్టి వెళ్ళిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ ఢిల్లీలో ఇద్దరి మధ్య ఏమి డీల్ కుదిరిందో ఏమో కానీ, ఢిల్లీలో ఆయన్ని కలిసి జాతీయ రైతి ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఇక అక్కడి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అలాగే, బీజేపే సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి, చివరకు దేశ రాజకీయాలను గుప్పిట పట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహా అనేక మందికి కూడా కేసీఆర్’తో చేతులు కలిపిన పుణ్యానికి అనుకోని ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అందుకే, కేసీఆర్’తో చేతులు కలిపేందుకు, ఆయనతో కలిసి నడిచేందుకు, ఆయనతో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కూడా ప్రాంతీయ పార్టీల నాయకులు వెనకాముందు అవుతున్నారని, హైదరాబద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆ మధ్యన ఓ నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే పని మీద ఢిల్లీ వెళ్లారు.అక్కడ వారం పది రోజులున్నా, ఎందుకో గానీ, ఆయన కలుద్దామనుకున్న ముఖ్యనేతలు ఎవరూ కలవలేదు. ఆ సమయంలో (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్, బీజేపే సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి మాత్రం ఆయన్ని కలిశారు. రాజకీయాలు. రైతు ఉద్యమ నిర్మాణం గురించి చర్చలు జరిపారు. అయితే అంతవరకు బీకేయూలో తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన రాకేష్ తికాయత్’ కు ఎదురు దెబ్బ తగిలింది. బీకేయూలో కీలక నేతలు ఆయనకు ఎదురు తిరిగారు. ఆయన సోదరుడు నరేష్ తికాయత్ బీకేయూ నుంచి బహిష్కరించారు. తికాయత్ సోదరులు రాకేశ్ తికాయత్, నరేష్ తికయత్ రాజకీయ పార్టీలతో అంటకాగుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ, బీకేయూ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేశ్ సింగ్ చౌహాన్, రాజకీయాలకు అతీతంగా రైతులకోసమే పనిచేసే భారతీయ కిసాన్ యూనియన్ (ఎ-అపొలిటికల్) సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదలా ఉంటే ఇప్పుడు బెంగుళూరులో తికాయత్ పై ప్రత్యక్షంగానే దాడి జరిగింది. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు, ఆయనపై,,’సిరా’దాడి చేశారు. దీంతో తికాయత్ అనుచరులు ఎదురు దాడి చేశారు. తికాయత్ కు గాయాలయ్యాయి. అయితే విషయం ఏమంటే, కర్ణాటకలో తికాయత్ అనుచరుడు, రైతు నాయకుడు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, స్టింగ్ ఆపరేషన్’లో దొరికి పోయారు. దీంతో రైతులు, తికాయత్, ఆయన అనుచరుల అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, తికాయత్ బెంగుళూరు వచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటుచేసి, వివరణ ఇచ్చే సమయంలోనే ఈ దాడి జరిగింది. నిజానికి, ఈదాడికి, తికాయత్ ఎప్పుడో ఢిల్లీలో కేసీఆర్ ‘తో భేటీ కావడానికి ప్రత్యక్ష సంబంధం లేక పోవచ్చును కానీ, అంతవరకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వివాదస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా సంవత్సరం పైగా ఉద్యమం నడిపిన రైతు నేతగా కితాబు అందుకున్న తికాయత్’ కు కేసీఆర్’ను కలిసిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. అదలా ఉంటే అక్కడ తికాయత్, ఇక్కడ హైదరాబాద్’లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దాడి వెనక బీజేపీ హస్తముందని ఆరోపించారు. అయితే, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఇంకో విధమైన ప్రచారం జరుగుతోంది. తికాయత్ బీజేపీ టార్గెట్ కావడానికి, కేసీఆర్’తో స్నేహమే కారణమని అంటున్నారు. తికాయత్ వ్యవహారం అలా ఉంటే, కేసీఆర్’ను ఢిల్లీ లో కలిసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుభ్రమణ్య స్వామికి మరోసారి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం మొండి చేయి చూపించింది. సుబ్రమణ్య స్వామికి బీజీపీ టికెట్ ఇవ్వక పోవడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నా, కేసీఆర్’తో రాజకీయ చర్చలు జరపడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. అలాగే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ పరిస్థితి కూడా కేసీఆర్’తో చేయి కలిపినా తర్వాతనే డోలాయమానంలో పడిందని, ఇప్పుడు ఆయన అటు వ్యూహకర్త కాదు, ఇటు రాజకీయ నాయకుడు కాదు, ఒక విధంగా చూస్తే రెంటికి చెడిన రేవడిలా తయారయ్యారు. ఇందుకు కూడా ప్రత్యక్షంగా కేసీఆర్’తో చెలిమి కారణం కాకపోవచ్చును కానీ, ఒక ఒకసారి ఐరన్ లెగ్ అని పేరు పడితే ఇక అంతే .. అందుకే కావచ్చు కేసీఆర్’కు దేశంలో ఎక్కడా ఉచిత అప్పాయింట్మెంట్ దొరకడం లేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/attak-on-tikayat-in-bengalore-39-136702.html





