హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్
Publish Date:Apr 11, 2025
Advertisement
మాతృదేవో భవ , పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ అని అంటాం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయింది. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించింది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు గురువారం(ఏప్రిల్ 10) చెప్పుతో కొట్టింది. స్థానిక జీనియస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయురాలు ఆగ్రహంతో ఊగిపోయింది ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టి వార్తల్లోకి ఎక్కింది. విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఉపాధ్యాయురాలు అనితను నిలదీస్తూ దాడి చేశారు. పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో పాఠశాల వద్ద టెన్షన్ నెలకొంది.
http://www.teluguone.com/news/content/atrocity-in-sathya-sai-district-teacher-beats-students-with-slippers-for-not-doing-homework-39-196041.html





