రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
Publish Date:Apr 11, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మూల్యాంకనం, రీ వెరిఫికేషన్, కంప్యూటరీకరణ ప్రక్రియలు పూర్తి కావడంతో ఫలితాలను శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షా ఫలితాలను ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ లో చూసుకోవచ్చు. అలాగే గతంలో హాల్ టికెట్లను ఎలా అయితే మొబైల్ నంబర్లకు పంపించారో అలాగే ఈ సారి ఇంటర్ విద్యార్థులకు పరీక్షా ఫలితాలను కూడా పంపిస్తారు. ఇందు కోసం ఏపీ విద్యార్థులు 9552300009 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు. వారి పరీక్షా ఫలితాలు వారి మొబైల్ కు వచ్చేస్తాయి.
http://www.teluguone.com/news/content/ap-inter-results-tomorrow-39-196039.html





