ఏటీఎం, దుకాణాలనూ లాక్కెళిపోయిన వరద
Publish Date:Aug 12, 2022
Advertisement
ఉత్తరాఖండ్‌లో భారీవర్షాలు, వరదలతాకిడితో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇటీవలి వరదల తాకిడికి సుమారు ఎనిమిది దుకాణాలు, ఏటీఎం కూడా వరద నీటిలో కొట్టుకుపోవడం ఆశ్చర్యపరు స్తున్నది. జువెలరీ దుకాణాలు, సుమారు పాతిక లక్షలతో ఉన్న ఏటీఎం మునిగి వరదల్లో కొట్టుకుపో వడం, చూసి ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. ఉత్తరకాశీ వద్ద నీటి ఉదృతి మరింత పెరగడంతో వరద తాకిడి ఊహించని స్థాయికి చేరుకుంది. దీంతో ఉత్తరకాశీలోని పురోలా బాగా దెబ్బతిన్నది. ముఖ్యంగా కుమోలా ఖాడ్ నీటి స్థాయి ఈ వర్షాల కారణంగా పెరిగిపోవడంతో పరిస్థితులు భయానకంగా మారాయని అధికారులు అంటున్నారు. చెట్లు, దుకాణాలతో పాటు ఏటీఎం కూడా బొమ్మల్లా కొట్టుకుపోవడం చూసినవారు వీడియో తీసి నెటిజన్లకు అందుబాటులో ఉంచారు. ఇదేవిధంగా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా పర్వతాలు మట్టిపెళ్లలు పెద్దస్థాయిలో విరిగి పడ్డాయని అక్కడి ప్రజలు తెలిపారు. ఉత్తరకాశీలో హైవేలు వరద నీటిలో మునిగి పోయాయి. వర్షాలు, వరదలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్థమయింది. పర్యాటకులు, ప్రాంతీయ ప్రజ లు అనేక మంది నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా, దెహరాడూన్ ఛాబ్రా గ్రామంలో ఉదయం నుంచీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్‌డి ఆర్ ఎస్ దళాలు డెహ్రాడూన్ చేరుకున్నాయి.
http://www.teluguone.com/news/content/atm-25-141809.html





