మొక్కుబడి తంతుగా అసెంబ్లీ సమావేశాలు

Publish Date:Feb 10, 2023

Advertisement

ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ సమావేశాలు జరిగినన్ని రోజులూ అసెంబ్లీ కళకళ లాడుతూ ఉండేది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగిన సందర్భాలలో కూడా సభ్యుల చాలావరకు సభలోనే ఉండేవారు.  అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ప్రజా సంఘాల హడావిడి కనిపించేది. ఇందిరా పార్క్  వద్ద ‘ధర్నా చౌక్’ ఉన్నంత వరకు  అనేక ప్రజా సంఘాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఉండేది. అలాగే, సామాన్య ప్రజల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగతున్నాయంటే, అదో రకమైన ఉత్కంఠ, ఇక మీడియా సంగతి అయితే చెప్పనే అక్కర లేదు.

అయితే, ఇప్పడు అదంతా గతించిన చరిత్రగా మిగిలి పోయింది.ఇప్పడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక మొక్కుబడి తంతుగా మారిపోయాయనే మాటే వినవస్తోంది. నిజానికి, ఆరు నెలలకు ఒకసారి తప్పక అసెంబ్లీ సమావేశం కావాలనే రాజ్యాంగ నిబంధన ఇంకా వుంది కాబట్టి  కానీ, లేదంటే ఇది కుడా ఉండేది కాదేమో అనే మాట కూడా విమర్శకుల నుంచి నిపిస్తోంది. 

ఇక ఇప్పుడు జరుగతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయానికి వస్తే, సభ్యుల హాజరు రోజు రోజుకు పలచబడుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల పట్ల, ప్రజా ప్రతినిథులకు ఆసక్తి లేకుండా పోతోందనే అభిప్రాయం బలపడుతోంది. నామినేటెడ్ సభ్యుడితో కలిపి తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 120... అందులో 105మంది  అధికార బీఆర్ఎస్ సభ్యులు. కానీ, ఏ రోజునా కూడా సభకు హాజరైన సభ్యుల సంఖ్య మూడంకెల సంఖ్యకు చేరడం లేదు. బడ్జెట్  సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (ఫిబ్రవరి 3) కాస్త పర్వాలేదనిపించినా, రెండో రోజు నుంచి సభ్యుల అటెండెన్స్ పడిపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌‌ సభలో ఉన్నప్పుడు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు సభలో ఉంటున్నారు. ఈ ఇద్దరూ లేనప్పుడు సభ్యుల సంఖ్య 50 కూడా దాటడం లేదు. మధ్యాహ్నం సెషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 30 నుంచి 40 మంది మాత్రమే ఉంటున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం పద్దులపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చే టైంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 29 మందే ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష సభ్యులు ఏడుగురు ఉండగా, అధికార పక్షం సభ్యులు 22 మంది ఉన్నారు. 

అసెంబ్లీకి వచ్చినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు సభలో కంటే లాబీలో, మంత్రుల చాంబర్లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అదేమని అడిగితే, నియోజక వర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లేందుకే, మంత్రుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పు కొస్తున్నారు. నిజానికి, శాసన సభ సమావేశాలు నిర్వహించేందే అందుకు.  ప్రశ్నోత్తరాలు, జీరో అవర్  ఇతర నిబంధనలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఉన్నాయి..అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు ఆ నిబంధనలను పొందు పరిచారు. అయితే, సభలో మొర పెట్టుకున్న వినే నాథుడు లేక పోవడం వల్లనే మంత్రులను ప్రత్యేకంగా కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పు కొస్తున్నారు.

సభలో సమస్యలు లేవనెత్తడానికి అవకాశం లేదని  అందుకే సభ బయట మంత్రులను కలుస్తున్నామంటున్నారు. ఇక సభలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష సభ్యులు కూడా సభలో కొంత సేపు, బయట కొంతసేపు ఉంటున్నారు.ఇంకొంత మంది ఎమ్మెల్యేలైతే అటెండెన్స్ వేయించుకోవడానికే వస్తున్నాం అన్నట్లుగా. సభలో కాసేపు ఉండి వెళ్లిపోతున్నారు. నిజానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పలుమార్లు హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. నిజానికి, ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే, ప్రజాస్వామ్య ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.