పంచిన డబ్బులు ఇచ్చేయండి అభ్యర్థి అగ్రహం

Publish Date:Feb 12, 2026

Advertisement

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రమైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని మండిపడుతూ ఓ కాంగ్రెస్ అభ్యర్థి నడ్డిరోడ్డుపై హంగామా చేయడం చర్చనీయాంశ మైంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, ఎన్నికల సమయం లో పంచిన డబ్బులు మరియు కుక్కర్లు వెనక్కి ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేస్తూ“నాకు ఓటు వేయకపోతే పంచిన డబ్బులు, కుక్కర్లు ఎందుకు తీసుకున్నారు?” అంటూ ప్రజలను నిలదీస్తూ అవమానకరంగా మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆ అభ్యర్థి నడ్డిరోడ్డుపై రచ్చ రచ్చ సృష్టించడంతో  అక్కడికి చేరుకున్న ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యచకితు లయ్యారు. అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు? ఎందుకు ఇలా అవమానిస్తు న్నారు?” అంటూ పలువురు ప్రజలు అతన్ని ప్రశ్నించారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియా లో షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన సందర్భంలో, ఓటు వేయలేదనే కారణంతో ప్రజలను అవమానించడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై ఎన్నికల అధికారులు లేదా పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్నికల సమయంలో డబ్బులు లేదా బహుమతులు పంచడం చట్టవిరుద్ధమనే విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపడతారా.. లేదా వేచి చూడాల్సిందే..అశ్వారావుపేటలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

By
en-us Political News

  
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.